E-Paper
Advertisement

Compact SUVs Under Rs 10 Lakhs: టాటా పంచ్ To మహీంద్రా XUV 3XO.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ SUV కార్లు ఇవే!

Compact SUVs Under Rs 10 Lakhs:  టాటా పంచ్ To మహీంద్రా XUV 3XO.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ SUV కార్లు ఇవే!
Advertisement

Budget Friendly Compact SUVs: ఈ రోజుల్లో చాలా మంది కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో పలు ఫీచర్ ప్యాక్డ్, స్టైలిష్, సురక్షితమైన కాంపాక్ట్ SUVలు అందుబాటులో ఉన్నాయి. రూ. 10 లక్షల లోపు బెస్ట్ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బలమైన ఇంజిన్ల నుంచి ఆకట్టుకునే మైలేజ్, భద్రతా రేటింగ్‌ల వరకు అన్నింట బెస్ట్ గా ఉన్న కార్లు ఏవనేది చూద్దాం..

రూ. 10 లక్షల్లోపు బెస్ట్ SUVలు

⦿ టాటా పంచ్: టాటా పంచ్ మంచి బిల్డ్ క్వాలిటీ, 5-స్టార్ BNCAP భద్రతా రేటింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఇది 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఎంపికతో వస్తుంది. దీని ఇంజిన్ 118 hp, 170 Nm టార్క్‌ ను అందిస్తుంది.  దీని ధరలు రూ. 5.60 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి. ఇది అత్యంత సరసమైన, సురక్షితమైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

⦿ హ్యుందాయ్ ఎక్సెంట్: ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, CNG వేరియంట్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 81 hp,  113.8 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 5.62 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. సిటీ డ్రైవింగ్, రోజువారీ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది.

⦿ మారుతి సుజుకి బ్రెజ్జా: కాంపాక్ట్ SUV విభాగంలో ప్రసిద్ధి చెందిన బ్రెజ్జా 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్, CNG ఎంపికతో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 99.23 hp, 137.1 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌ మిషన్ ఎంపికలలో 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి. ఈ SUV ప్రారంభ ధర రూ. 8.26 లక్షలు.

Advertisement

Read Also: ఎర్లీ మార్నింగ్ vs లేట్ నైట్.. ఏ టైమ్ లో డ్రైవింగ్ చేయడం బెస్ట్?

⦿ మహీంద్రా XUV 3XO: మహీంద్రా XUV 3XO పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 128 hp పవర్ 230 Nm టార్క్ ను అందిస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115 hp పవర్, 300 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ లతో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ధరలు రూ.7.37 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి.

⦿ మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఈ కారు ధర సుమారు రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్రాంక్స్ 1.2-లీటర్ K-సిరీస్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు పెట్రోల్, CNG ఎంపికలతో వస్తుంది. టర్బో ఇంజన్ 98.7 hp పవర్,  147.6 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ కారు 21.5కిలో మీటర్లు, ఆటోమేటిక్ 20.01 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Read Also: సెలెరియో To వ్యాగన్ R.. సూపర్ మైలేజ్ ఇచ్చే బెస్ట్ CNG కార్లు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×