E-Paper
Advertisement

Rukmini Vasanth: జోరు పెంచిన రుక్మిణీ వసంత్.. ఏకంగా బడా ప్రాజెక్టుల్లో అవకాశం!

Rukmini Vasanth: జోరు పెంచిన రుక్మిణీ వసంత్.. ఏకంగా బడా ప్రాజెక్టుల్లో అవకాశం!
Advertisement

Rukmini Vasanth:ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పడం అసాధ్యం. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్క హిట్టు పడిందంటే చాలు వరుసగా ఆఫర్లు కూడా క్యూ కడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ హీరోయిన్స్ సరైన కథలను ఎంచుకొని ముందడుగు వేస్తే మాత్రం.. పది కాలాలపాటు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అటు యంగ్ హీరోయిన్స్ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కూడా ఒకరు. తెలుగులో నిఖిల్ సిద్ధార్థ(Nikhil siddhartha) హీరోగా “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

జోరు పెంచిన రుక్మిణి వసంత్..

ఆ తర్వాత తమిళ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. అందులో భాగంగానే ఏఆర్ మురుగదాస్ (Muragadas) దర్శకత్వంలో శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా వచ్చిన ‘మదరాసి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీంతో ఈమె పనైపోయిందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత రిషబ్ శెట్టి (Rishabh Shetty) హీరోగా ‘కాంతారా’ సినిమా ప్రీక్వెల్ గా వచ్చిన ‘కాంతారా చాప్టర్ 1’ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.పైగా రిషబ్ శెట్టిని కూడా కొన్ని సన్నివేశాలలో డామినేట్ చేసింది అంటే సరైన పాత్ర పడితే తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమని దర్శకులకు హింట్ ఇచ్చింది.

Advertisement

నాగచైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అవకాశం..

అందులో భాగంగానే ఇప్పుడు ఈ బ్యూటీ కి వరుస5 అవకాశాలు తలుపు తడుతున్నాయి. అందులో భాగంగానే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న కొత్త హీరోలతో పాటు ఆల్రెడీ హీరోలుగా కొనసాగుతున్న టైర్ 2 హీరోలకు జోడిగా నటిస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె అందుకుంటున్న అవకాశాలను బట్టి చూస్తే మాత్రం రుక్మిణి వసంత్ జోరు మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పటికే తెలుగులో ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. మరొకవైపు నాగచైతన్య దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో వృషకర్మ తర్వాత నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బెదురులంక 2012 చిత్రంతో దర్శకుడుగా మారిన క్లాక్స్ .. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్నారని.. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం.

Advertisement

ALSO READ:Kiran abbavaram: రెమ్యూనరేషన్ డబుల్.. లైనప్ మామూలుగా లేదుగా!

ధృవ్ విక్రమ్ కి జోడిగా..

ఇక ఈ సినిమాతో పాటు విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ నటిస్తున్న ఒక చిత్రంలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి దీపక్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా… మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. అలాగే సాయి అభ్యంకార్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై కూడా అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా వరుస అవకాశాలతో రుక్మిణి వసంత్ జోరు పెంచిందని చెప్పవచ్చు.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×