E-Paper
Advertisement

Electric Fiat Padmini: ఫియట్ పద్మిని మళ్లీ వస్తుందా? అదీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో!

Electric Fiat Padmini:  ఫియట్ పద్మిని మళ్లీ వస్తుందా? అదీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో!
Advertisement

Fiat Padmini Came Back as an Electric Car: ఫియట్ పద్మిని.. 1960 నుంచి 2001 వరకు మార్కెట్ లో సత్తా చాటిన ఐకానిక్ ఇండియన్ కారు. ఇది ఫియట్ 1100 డిలైట్ లైసెన్స్ పొందిన వెర్షన్‌గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా ముంబైలోని ప్రసిద్ధ నలుపు- పసుపు టాక్సీలుగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

అధికారికంగా నిలిచిపోయిన ఉత్పత్తి   

నిజానికి ఈ కార్ల ఉత్పత్తి చాలా కాలం క్రితమే నిలిచిపోయింది. ఇటీవల ఫియట్ ఇండియా పరిమిత జీప్ ఆఫర్లు, కొత్త కార్ల కోసం ప్రణాళికలు రెడీ చేస్తోంది. పాండా అప్ డేట్స్, పుంటో EV లాంటి ఇతర మోడళ్లపై దృష్టి సారించింది.  కానీ, ఫియట్ నుంచి కొత్త పద్మిని వస్తుందని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఊహాజనిత, కాన్సెప్ట్-శైలి వీడియోలు, AI-జనరేటెడ్, క్లిక్‌ బైట్ కంటెంట్‌గా బోలెడు వార్తలు కనిపిస్తున్నాయి.

ఫియట్ పద్మిని ఈవీ వస్తుందా?

Advertisement

ఫియట్ పద్మిని కారు, ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకురావాలనే ఆలోచ చేస్తున్నట్లు తెలుస్తోంది. EV అనేది పాత క్లాసిక్ కార్లను ఎలక్ట్రిక్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా రూపొందించబడిన మోడల్. ఇది పాత పెట్రోల్ ఇంజిన్‌ను తొలగించి, బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటారును అమర్చి తయారు చేస్తారు. ఈ కారు పర్యావరణ అనుకూలంగా రాబోతోంది. తక్కువ మెయింటెనెన్స్, క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఫియట్ పద్మిని EV కీలక వివరాలు

⦿ ఈవీగా కన్వర్షన్: పాత ఫియట్ పద్మిని కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారుస్తున్నారు. ఇది పాత వాహనాలకు కొత్త జీవాన్ని ఇస్తుంది.

Advertisement

⦿ ఎలక్ట్రిక్ మోటార్: ఇది శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారు. బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగిస్తుంది. 35–38 kWh బ్యాటరీ ప్యాక్‌ తో రానున్నట్లు తెలుస్తోంది.

⦿ పర్యావరణ అనుకూలత: ఈ కారు సున్నా ఉద్గారాలను వెదజల్లుతుంది. ఇది పర్యావరణానికి చాలా మంచిది.

⦿ డిజైన్: క్లాసిక్ ఫియట్ పద్మిని బాడీ అలాగే ఉంటూ, ఆధునిక EV సాంకేతికతను యాడ్ చేస్తున్నారు.

⦿ మైలేజ్/రేంజ్: ఈ EV ఒకే ఛార్జ్‌ పై 250–320 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.

Read Also: టాటా పంచ్ To మహీంద్రా XUV 3XO.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ SUV కార్లు ఇవే!

క్లాసిక్ బాక్సీ లుక్, రౌండ్ హెడ్‌ లైట్లు, నలుపు-పసుపు టాక్సీ ప్రేరేపిత రంగులను ఉంచే రెట్రో మోడ్రన్ డిజైన్, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, మెరుగైన భద్రత, సమర్థవంతమైన పవర్‌ ట్రెయిన్ల లాంటి ఆధునిక టచ్‌లతో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఈ కారు డెవలపింగ్ పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కంపెనీ నుంచి ఫియట్ పద్మిని కారు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read Also: సెలెరియో To వ్యాగన్ R.. సూపర్ మైలేజ్ ఇచ్చే బెస్ట్ CNG కార్లు!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×