E-Paper
Advertisement

Donald Trump: ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’.. ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump: ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’.. ట్రంప్ సంచలన ప్రకటన
Advertisement

ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలు తమ పోరాటాన్ని ఆపవద్దని అన్నారు. దేశ విముక్తి కోసం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ (MIGA) అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

ప్రభుత్వ సంస్థల స్వాధీనానికి పిలుపు

Advertisement

ఇరాన్ దేశభక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రభుత్వ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ట్రంప్ సూచించారు. ‘ఇరాన్ దేశభక్తులారా.. మేల్కొనండి. మీ హక్కుల కోసం పోరాడండి. ప్రభుత్వ సంస్థలను చేజిక్కించుకోండి’ అని ఆయన పేర్కొన్నారు. నిరసనకారులపై హింసకు పాల్పడుతున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.

రికార్డులు భద్రపరచండి..

Advertisement

ప్రజలపై దాడులు చేస్తున్న వారి వివరాలను సేకరించాలని ట్రంప్ సూచించడం గమనార్హం. ‘మిమ్మల్ని చంపే వారి, నిందించే వారి పేర్లను, వివరాలను సేవ్ చేసుకోండి. భవిష్యత్తులో వారు చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. అణచివేతకు పాల్పడుతున్న అధికారులు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

దౌత్యపరమైన ఆంక్షలు

ఇరాన్ ప్రభుత్వ తీరుపై నిరసనగా ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులపై కాల్పులు, హింసను ఆపేంత వరకు ఇరాన్ ప్రతినిధులతో తాను జరపాల్సిన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఇరాన్ పౌరులకు అతి త్వరలోనే అంతర్జాతీయ సాయం అందబోతోందని.. వారు ఒంటరి వారు కాదని ఆయన భరోసా ఇచ్చారు.

చివరగా, తన ప్రసిద్ధ నినాదం ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ తరహాలోనే.. ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’ (MIGA) అంటూ తన పోస్ట్‌ను ముగించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.

ALSO READ: Medaram Jatara: మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. 3,495 ప్రత్యేక బస్సులు, ఆడవారికి ఫ్రీ జర్నీ ఉంటుందా..?

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×