E-Paper
Advertisement

Vinfast Electric Scooters: విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, లాంచింగ్ ఎప్పుడంటే?

Vinfast Electric Scooters: విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ విన్ ఫాస్ట్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. భారత్ కు అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లను డెవలప్ చేస్తోంది. 2026 సెకెండాఫ్ లో భారతీయ మార్కెట్ లోకి రానుంది.  అంతేకాదు, మిలియన్ యూనిట్ల లాంగ్ టర్మ కెపాసిటీతో కూడిన టూవీలర్ తయారీ లైన్‌ను నిర్మించాలని భావిస్తోంది.  కూడా కంపెనీ యోచిస్తున్నట్లు పేర్కొంది. తమిళనాడులోని ప్లాంట్ లో స్కూటర్ల తయారీ ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్లను కేవలం భారత మార్కెట్ కోసం తయారు చేస్తున్నది.

కీలక విషయాలు వెల్లడించిన విన్ ఫాస్ట్ అధికారులు

ఈ మేరకు విన్ ఫాస్ట్ ఆసియా CEO ఫామ్ సాన్ చౌ కీలక విషయాలు వెల్లడించారు. ఇండియన్ మార్కెట్ కు సంబంధించి తమ కంపెనీ చేపడుతున్న ప్రణాళికలను వివరించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ తమిళనాడులోని విన్‌ ఫాస్ట్ ప్లాంట్‌ లో జరుగుతుందన్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రత్యేక కోసం కంపెనీ మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందన్నారు. స్కూటర్లను గ్లోబల్ క్యారీ ఓవర్ ఉత్పత్తులుగా కాకుండా, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఫోర్ వీలర్ సామర్థ్యం 1,50,000కు పెంపు

Advertisement

ఇప్పటికే విన్ ఫాస్ట్ ఫోర్ వీలర్ ప్లాంట్ వార్షిక సామర్థ్యాన్ని 1,50,000 యూనిట్లుగా పెంచుతున్న కంపెనీ, టూవీలర్ రంగంలోనూ సత్తా చాటేందుకు పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. దీర్ఘకాలికంగా మిలియన్ యూనిట్ల సామర్థ్యం తో ఉండేలా రూపొందిస్తున్నారు. అయితే, ఇందుకోసం కంపెనీ ఎంత పెట్టుబడి పెడుతోంది అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

Read Also: యమహా నుంచి సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందంటే?

Advertisement

అదే సమయంలో ఖర్చులను తగ్గించడానికి, పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి బ్యాటరీలతో సహా ఇరత భాగాలను స్థానికంగా తయారు చేసేందుకు ఇండియన్ సరఫరాదారులతో విన్ ఫాస్ట్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పెట్టుబడుల స్థాయి, సమయాన్ని బట్టి PLI, PM E DRIVE లాంటి ప్రభుత్వ ప్రోత్సాహక కార్యక్రమాలను ఉపయోగించుకునేలా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

తక్కువ ధరలతో ఎలక్ట్రిక్ వాహనాలు

గత ఏడాది కాలంగా విస్తృతమైన మార్కెట్ ను పరిశీలించిన తర్వాత విన్ ఫాస్ట్ తన స్కూటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. భారతీయులు ఏ అంశాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలుసుకుని దానికి అనుగుణంగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలు స్థానిక అవసరాలు, మౌలిక సదుపాయాలు, సాధారణ ప్రయాణాలు, ధర సహా పలు విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. తమ కంపెనీ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుతం ఉన్న స్కూటర్లతో పోల్చితే సరసమైన ధరలకు అందుబాటులో ఉండబోతున్నట్లు CEO ఫామ్ సాన్ చౌ తెలిపారు. త్వరలోనే తమ కంపెనీ నుంచి విడుదల కాబోయే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వివరాలను వెల్లడించనట్లు చెప్పారు.

Read Also: న్యూ ఇయర్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసి కార్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×