E-Paper
Advertisement

YSRCP : అమరావతి రైతులే వైసీపీ నెక్స్ట్ టార్గెట్.. ఆ విషయం మరిచారా?

YSRCP : అమరావతి రైతులే వైసీపీ నెక్స్ట్ టార్గెట్.. ఆ విషయం మరిచారా?
Advertisement

ఏపీలో రాజధాని ప్రకంపనలు ఇంకా చల్లారలేదు. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఇంకా రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తున్నట్టు తెలుస్తున్నది. తాము అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతి ఉంటుందని మాజీ సీఎం జగన్..ఆ పార్టీ నేతలు ప్రకటించడం లేదు. సీఎం చంద్రబాబు మాత్రం ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతే ఉంటుందని ఆయన ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఒకవేళ మరల వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని మార్చకుండా ఉండేందుకు అమరావతికి చట్టబద్దత కల్పించాలని చూస్తున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీ రాజధానిగా అమరావతినే భావిస్తున్నట్టు పార్లమెంటులో కేంద్రమంత్రులు ప్రకటించారు.

అప్పుడు రైతులు సమస్యలు గాలికి..

2014లో నాటి ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించాక ఆ చుట్టు పక్కల రైతుల నుంచి పెద్దఎత్తున పంట భూములను సేకరించింది. రాజధాని నిర్మాణం ప్రారంభించి హైకోర్టు, సచివాలయ తాత్కాలిక భవనాల నిర్మాణం మధ్యలో ఉండగానే.. ప్రభుత్వం మారడం ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా పట్టించుకోకుండా మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తేవడం జరిగిపోయాయి. ఫలితంగా ప్రభుత్వానికి మూడు పంటలు పండే భూములు ఇచ్చిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. జగన్ పాలనలో అమరావతి రైతులు సంవత్సరాల పాటు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఉద్యమించిన రోజులు సైతం ఉన్నాయి.

ఇప్పుడు రైతు సమస్యలే ఎజెండా..

Advertisement

జగన్ ముఖ్యమంత్రిగా సమయంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను పిలిచి ఏనాడూ మాట్లాడలేదనే అపవాదు ఉన్నది. గత ఐదేండ్ల కాలంలో వారి సమస్యలు కూడా వినలేదని.. పరిహారం కూడా ప్రకటించలేదని విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ.. తాజాగా అమరావతి రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. కూటమి సర్కార్ హయాంలో సీఆర్‌డీఏ పరిధిలో మరింత ల్యాండ్ పూలింగ్ చేసి అభివృద్ది చేయాలని సర్కార్ భావిస్తుండగా.. అందుకు వైసీపీ నేతలు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.కావాలనే రైతుల పేరిట అభివృద్దికి వైసీపీ నేతలు అడ్డంకిగా మారారని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.

PM Modi Mann Ki Baat: అనంతపురంలో జలాశయాల పునరుద్ధరణ.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు

Advertisement

కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని అమరావతిని అభివృద్ది చేస్తున్నది. దీనికి తోడు రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని సైతం అడ్జస్ట్ చేస్తున్నది. అవి ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే రైతుల నుంచి భూమి సేకరించి రాజధాని ప్రాంతంలో కొత్తగా పెట్టుబడులు, కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టేవారికి ఇవ్వడం ద్వారా అక్కడ ప్రొడక్షన్ జరిగి ఉపాధితో పాటు ఆదాయం సమకూరి రాజధాని అభివృద్ధికి దోహపడుతుందని సీఎం చంద్రబాబు భావించగా.. అందుకు అడ్డం తగులుతూ రైతులను వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రైతులు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. గత ఐదేండ్లలో అమరావతి రైతులు ధర్నా చేస్తే వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించిన వైసీపీ నేతల మాటలు మర్చిపోయారా?అంటూ కూటమి నేతలు గుర్తుచేస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×