E-Paper
Advertisement

The Kerala Story 2 Collections: కేరళ స్టోరీ 2 మొదటి రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

The Kerala Story 2 Collections: కేరళ స్టోరీ 2 మొదటి రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Advertisement

The Kerala Story 2 Collections: ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే తీవ్ర వివాదాల్లో ఉన్న ది కేరళ స్టోరీ 2 సినిమా చివరకు థియేటర్లలోకి వచ్చింది. కోర్టు అనుమతులు తీసుకుని ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. తొలి రోజే సినిమా కలెక్షన్లు చాలా తక్కువగా నమోదయ్యాయి. చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా కనిపించాయి.

కాంట్రవర్సీల మధ్య విడుదలైన సినిమా పరిస్థితి ఇదే!

ఈ సినిమా విడుదలైన రోజే ప్రేక్షకుల స్పందన బలహీనంగా ఉంది. కొన్ని థియేటర్లలో షోలు నడుస్తున్నా, సీట్లు నిండని పరిస్థితి నెలకొంది. కేరళలోని ఒక ప్రముఖ మల్టీప్లెక్స్‌లో నాలుగు షోలకు కలిపి కేవలం 68 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement

సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. మొదటి రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన వసూళ్లు సుమారు రూ.3.5 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయని సమాచారం. సినిమా బ్రేక్ ఈవెన్ చేరాలంటే కనీసం రూ.60 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే తొలి రోజు ట్రెండ్ చూస్తే ఆ లక్ష్యం చాలా కష్టం అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరోవైపు, సినిమా కంటెంట్‌పై నిరసనలు కూడా జరుగుతున్నాయి. కేరళ రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని ఆరోపిస్తూ కొన్ని యువజన సంఘాలు థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహించాయి. కొన్ని చోట్ల సినిమా పోస్టర్లు చింపివేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఆక్యుపెన్సీ చాలా తక్కువగా నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కేవలం 14 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ కనిపించగా, ముంబైలో అది ఇంకా తక్కువగా ఉంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ పరిస్థితి మారలేదు.

2023లో వచ్చిన ది కేరళ స్టోరీ మంచి వసూళ్లు సాధించడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వివాదాలు, ప్రతికూల ప్రచారం, ప్రేక్షకుల ఆసక్తి లేకపోవడం కలిసి ఈ సినిమాపై ప్రతికూల ప్రభావం చూపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

ALSO READ: Geethu Royal: నాపై చర్యలు తీసుకుంటారట… జీవితమే నాశనమైంది.. గీతూ రాయల్ ఎమోషనల్!

Related News

లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!

శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్ ‘ టీజర్ రిలీజ్!

10 ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన నటి అహానా కృష్ణ.. వరుడు ఎవరంటే?

చిన్నారి మృతి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి పూర్ణ!

Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. ఇది అస్సలు ఊహించలేదు మావా..!

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

ఫాహ్.. ఈ ఫన్నీ సౌండ్‌కు స్ఫూర్తి కమెడియన్ వేణు మాధవ్?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

Big Stories

Advertisement
×