E-Paper
Advertisement

US Israel Attacks: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తృటిలో బయటపడిన ఎన్టీఆర్!

US Israel Attacks: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తృటిలో బయటపడిన ఎన్టీఆర్!
Advertisement

US Israel Attacks: యూఎస్, ఇజ్రాయిల్ మద్య యుద్ధ వాతావరణ పరిస్థితులు చోటుచేసకున్నాయి. అమెరికా, ఇరాన్ అణు ఒప్పందం మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ పై క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్యత పరిస్థితులు చోటు చేసుకోవటమే కాకుండా ఈ క్షీపని దాడులలో భారీగా మరణాలు కూడా సంభవించాయి. ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జోర్డాన్ లో ఉన్న భారతీయులకు అధికారులు అప్రమత్తం జారీ చేశారు. ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితులలో నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) క్షేమంగా బయటపడ్డారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల జోర్డాన్ (Jordon)వెళ్లిన సంగతి తెలిసిందే.

ప్రమాదం నుంచి బయటపడిన ఎన్టీఆర్..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం చిత్ర బృందం ఇటీవల జోర్డాన్ వెళ్లారు. అయితే అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడక ముందే చిత్ర బృందం షూటింగ్ ముగించుకొని సురక్షితంగా ఇండియా చేరుకున్నారు. దీంతో ఎన్టీఆర్ తో పాటు డ్రాగన్ చిత్ర బృందం ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఒకవేళ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోయి ఉంటే ఎన్టీఆర్ తో పాటు ఇతర చిత్ర బృందం కూడా జోర్డాన్ లో చిక్కుకుపోయే ప్రమాదం ఉండేది. అదృష్టవశాత్తు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడక ముందే ఎన్టీఆర్ సురక్షితంగా ఇండియా చేరుకున్నారు.

డ్రాగన్ పనులలో బిజీగా తారక్…

Advertisement

ఎన్టీఆర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారునే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితిలో నెలకొనడంతో భారతీయులు ఎంతో భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఎన్టీఆర్ సినిమాలో అక్కినేని అఖిల్?

Advertisement

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా నటించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అఖిల్ అక్కినేని ఈ సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని చిత్ర బృందం తెలియచేశారు. డ్రాగన్ పేరుతో షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు త్వరలోనే మరొక టైటిల్ ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

Also Read: Geethu Royal: నాపై చర్యలు తీసుకుంటారట… జీవితమే నాశనమైంది.. గీతూ రాయల్ ఎమోషనల్!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×