E-Paper
Advertisement

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడిస్తే, పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను ఫ్రీగా హజ్ యాత్ర‌కు తీసుకెళ్తా

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడిస్తే, పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను ఫ్రీగా హజ్ యాత్ర‌కు తీసుకెళ్తా
Advertisement

Kamran Akmal:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా టీమిండియా పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal ) షాకింగ్ కామెంట్స్ చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ( 2027 World Cup) టీమిండియన్ ఓడించి పాకిస్తాన్ ఛాంపియన్ అవుతుందని ఛాలెంజ్ విసిరారు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తే.. పాకిస్తాన్ ప్లేయర్లను ( Pakistan Players) ఫ్రీగా హజ్ యాత్రకు ( Free Hajj ) తీసుకువెళ్తానని కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal) సంచలన ప్రకటన చేశారు. ఆ దిశగా పాకిస్తాన్ ముందుకు దూసుకు వెళ్లాలని కూడా వెల్లడించారు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఎప్పుడు అంటే ?

Advertisement

2027 పురుషుల వన్డే వరల్డ్ కప్ ( 2027 World Cup) టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ ను 2027 నవంబర్ సమయంలో నిర్వహిస్తారు. మూడు దేశాలలో సంయుక్తంగా 2027 వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే అలాగే నమీబియా దేశాలలో నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 54 మ్యాచులు జరగనుండగా.. మెజారిటీ మ్యాచులు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. అంటే 44 మ్యాచ్ లకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తుంది. జింబాబ్వే అలాగే నమీబియా మిగిలిన 10 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మొత్తం ఈ టోర్నమెంట్ లో 14 జట్లు పాల్గొంటాయి. రెండు గ్రూపులుగా డివైడ్ చేయబోతున్నారు. ఈ లెక్క ప్రకారం ఈ టోర్నమెంట్ లో కచ్చితంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్ తో పాటు, ఫైనల్స్ లేదా సెమీ ఫైనల్స్ లో మ్యాచ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

టీమిండియాను ఓడిస్తే, పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు ఫ్రీగా హజ్ యాత్ర‌

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియాను చిత్తుగా ఓడించి టైటిల్ గెలిస్తే పాకిస్తాన్ ప్లేయర్లను ఉచితంగానే హజ్ యాత్రకు తీసుకువెళ్తానని కమ్రాన్ అక్మ‌ల్ సంచలన ప్రకటన చేశారు. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఇండియా చేతిలో పాకిస్తాన్ టీం పరువు పోయిందని మండిపడ్డారు. అయితే వాళ్లపై రెవేంజ్ తీర్చుకోవాలంటే, 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ వేదిక చేసుకోవాల‌ని గుర్తు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా గ్రూప్ స్టేజ్ తో పాటు.. సెమీస్ అలాగే ఫైనల్స్ ఎక్కడ టీమిండియాతో మ్యాచ్ జరిగిన కూడా… చిత్తుగా ఓడించాలని పాకిస్తాన్ జట్టును కోరారు. అలా టీమిండియాలో చిత్తుగా ఓడిస్తే, హజ్ యాత్రకు ఫ్రీగా పాకిస్తాన్ క్రికెటర్లను తీసుకువెళ్తానని సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు కమ్రాన్ అక్మల్.

Advertisement

 

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

https://www.facebook.com/photo/?fbid=988792424061500&set=a.808612632079481

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×