E-Paper
Advertisement

Tata Punch Facelift Launch Date: టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ కన్ఫార్మ్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అదుర్స్!

Tata Punch Facelift Launch Date: టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ కన్ఫార్మ్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అదుర్స్!
Advertisement

Tata Punch Facelift Launch Date Confirmed: టాటా నుంచి మరో క్రేజీ కారు లాంచ్ కాబోతోంది. టాటా మోటార్స్ లో అద్భుతమైన అమ్మకాలు కొనసాగించిన పంచ్ ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో అందుబాటులోకి రాబోతోంది. తాజాగా ఈ కొత్త మోడల్ లాంచ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. జనవరి13, 2026న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కారుకు సంబంధించి రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ లో డిజైన్ మార్పులు, సెగ్మెంట్ ఫస్ట్ ADAS, 360° కెమెరా లాంటి సరికొత్త ఫీచర్లు వెల్లడయ్యాయి. 2021లో లాంచ్ అయిన పంచ్ ICE మోడల్‌ కు ఫస్ట్ మేజర్ ఫేస్‌లిఫ్ట్ గా మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది.

టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ కీ ఫీచర్లు

Advertisement

టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లో అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఇది ఫేస్ లిఫ్ట్ సెగ్మెంట్‌ లోని చిన్న SUVలలో మొదటిదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ కింద, ORVMల కింద బల్జ్‌ తో కనిపిస్తుంది. ఈ కారులో పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ లోగోతో పాటు కొత్త స్టీరింగ్ వీల్ ఉంటుంది.

టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ డిజైన్ మార్పులు

టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్  డిజైన్ విషయానికి వస్తే, కొత్త బంపర్, బ్లాక్ క్లాడింగ్, సిల్వర్ సరౌండ్ ఎయిర్ డ్యామ్, డ్యూయల్ ఎయిర్ ఇంటేక్ స్లిట్స్, ఎయిర్ కర్టెన్స్, వర్టికల్ LED హెడ్‌ లైట్స్, స్లీక్ LED DRLలను తీసుకొస్తుంది. వీల్స్ విషయానికి వస్తే, టాప్ ట్రిమ్స్‌ లో కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రియర్ లో  కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ బ్లాక్ ట్రిమ్ తో రానున్నాయి. రీవర్క్డ్ బంపర్ ఉంటుంది. ఈ కారు న్యూ బ్లూ షేడ్ తో పాటు మరికొన్ని రంగుల్లో రానుంది. ఈ కారుకు సంబంధించిన  ఫ్రంట్,  టెయిల్‌గేట్‌ లో క్రేజీ టాటా లోగో ఉంటుంది. జనరల్ సిల్యూట్ పాతదే అయినప్పటికీ, పంచ్ EV నుంచి క్యూస్ తీసుకుంది.

టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ ఇంజిన్, స్పెసిఫికేషన్లు

Advertisement

టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ ప్రీ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే మెకానికల్‌గా ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ NA పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.  88 PS పవర్, 115 Nm టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదంటే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. సీఎన్‌జీ విషయానికి వస్తే 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది. 73.5 PS పవర్,  103 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మాత్రమే ఉంటుంది. కొన్ని ఆటో సైట్స్ టర్బో పెట్రోల్ ఆప్షన్ గురించి చెప్పాయి. కానీ, అధికారికంగా కన్ఫార్మ్ కాలేదు.

టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ అంచనా ధర

టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్  అంచనా ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ప్రస్తుత మోడల్ రూ. 5.50 లక్షల నుంచి రూ. 9.30 లక్షల వరకు ఉంటుంది. కొత్త టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ హ్యుండాయ్ ఎక్స్‌టర్, మారుతి ఇగ్నిస్, సిట్రోయెన్ C3, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: BMW నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ లేకుండానే నడిపేయొచ్చు!

Related News

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

Big Stories

Advertisement
×