E-Paper
Advertisement

AP News: మమకారం మంటగలిసింది.. 40 రోజుల పసికందును పొట్టన పెట్టుకున్న తల్లి

AP News: మమకారం మంటగలిసింది.. 40 రోజుల పసికందును పొట్టన పెట్టుకున్న తల్లి
Advertisement

AP News: కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంత కష్టం వచ్చిన ఒక తల్లి తన పిల్లలకు చిన్న కష్టం రాకుండా అన్ని తానే అయ్యి చూసుకుంటుంది. కానీ, ఇక్కడ ఒక తల్లి తన 40 రోజుల పసికందును ప్రాణాల్ని తీసింది.

అయితే ఈ ఘటనలో పుట్టిన బిడ్డ అనారోగ్యం పాలవడంతో అదనపు వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిందని, దీనికి తోడు ఇంట్లో ఉన్న అత్త సూటిపోటి మాటలు, భర్త సాయిచైతన్య వేధింపులు ఆ తల్లిని మానసిక క్షోభకు గురిచేశాయి. బిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన సమయంలో, ఆ కుటుంబం నుంచి ఆదరణ లభించకపోగా వేధింపులు పెరగడం ఆ తల్లిని ఒక దారుణమైన నిర్ణయం వైపు నెట్టేశాయి.

Advertisement

దీంతో ఒకవైపు మాతృత్వపు మమకారం, మరోవైపు అత్తా-భర్తల నుంచి వస్తున్న ఒత్తిడి మధ్య నలిగిపోయిన ఆ తల్లి చివరకు ప్రాణ సమానమైన బిడ్డను గొంతు నులిమి చంపేసింది. బిడ్డ చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

Also Read: కళ్లెదుటే ఘోరం.. భర్త హెచ్చరించినా ఆగని అక్రమ బంధం.. చివరికి..

Advertisement

ప్రస్తుతం పోలీసులు పసికందు మృతికి కారణమైన కన్నతల్లిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, వేధింపులకు పాల్పడిన ఆమె భర్త సాయిచైతన్య, అత్తపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. “నిర్లక్ష్యం, వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి” అని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×