E-Paper
Advertisement

వాగన్ ఆర్ మాత్రమే కాదు.. భారత్‌లోకి రానున్న 5 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు ఇవే!

వాగన్ ఆర్ మాత్రమే కాదు.. భారత్‌లోకి రానున్న 5 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు ఇవే!
Advertisement

India’s Flex-Fuel Revolution: దేశంలో ఇథనాల్ ఆధారిత వాహనాలపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం లాంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇటీవల వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ E20 నుంచి E100 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, వాగన్ ఆర్ ఒక్కటే కాదు, రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రముఖ కార్లు కూడా ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్

మారుతి సుజుకి నుంచి త్వరలో ఫ్రాంక్స్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ లో రానుంది. కంపెనీ ఇప్పటికే జపాన్ మొబిలిటీ షోలోఈ  కాన్సెప్ట్‌ ను ప్రదర్శించింది. ఈ మోడల్ E85 ఇంధన మిశ్రమానికి సపోర్టు చేయనుంది.  ప్రస్తుతం ఫ్రాంక్స్‌ లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను ప్రత్యేకంగా అప్‌ డేట్ చేసి ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది.

⦿ టయోటా కొరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయల్

Advertisement

టయోటా కొరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ కారు ఇప్పటికే ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఉపయోగంలో ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో 1.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. పెట్రోల్‌ తో పాటు ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై కూడా  ఈ కారు నడుస్తుంది.

⦿ ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్  

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ కూడా మరికొద్ది నెలల్లో విడుదల అవుతుంది. ఇప్పటికే హైబ్రిడ్ టెక్నాలజీతో మంచి ఆదరణ పొందిన ఈ MPV, E85 ఇథనాల్ మిశ్రమంతో కూడా నడిచేలా అభివృద్ధి చేయబడింది. దీంతో సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఇది మరింత పర్యావరణహితంగా ఉంటుంది.

⦿ హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్

Advertisement

హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా అందుబాటులోకి రానుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పోలో దీనిని కంపెనీ ప్రదర్శించింది. దక్షిణ అమెరికా మార్కెట్లలో ఇప్పటికే ఈ తరహా మోడల్ అమ్మకాల్లో ఉంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ వెర్షన్ 100 శాతం ఇథనాల్ ఇంధనంపై కూడా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

⦿ టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్

టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో టాటా మోటార్స్ దీనిని ప్రదర్శించింది. ప్రస్తుతం పంచ్‌లో ఉపయోగిస్తున్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ వాహనం E100 వరకు ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటా, సియెర్రాకు పోటీ తప్పదా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×