E-Paper
Advertisement

Two Wheeler Tyres: BKT నుంచి సరికొత్త టూవీలర్ టైర్లు లాంచ్, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Two Wheeler Tyres:  BKT నుంచి సరికొత్త టూవీలర్ టైర్లు లాంచ్, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

BKT Two Wheeler Tyres Unveiled: భారతీయ టైర్ల తయారీ సంస్థ బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త టైర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు పెద్ద వాహనాలకు సంబంధించిన ఈ సంస్థ ఇప్పుడు దేశీయ టూ వీలర్ టైర్ల విభాగంలోకి అధికారికంగా ప్రకటించింది. తాజాగా BKT సంస్థ జెనోవా, థైరోస్ పేరుతో రెండు రకాల టూ వీలర్ టైర్లను లాంచ్ చేసింది. వాస్తవానికి BKT భారీ మైనింగ్ ట్రక్కులపై ఉపయోగించే ఆఫ్ హైవే టైర్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ ఇప్పుడు టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించడంతో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టినట్లు అయ్యింది.

BKT కొత్త టూవీలర్ టైర్ల గురించి..

BKT తాజాగా తీసుకొచ్చిన జెనోవా టైర్లను ప్రధానంగా పట్టణ ప్రయాణికుల కోసం అభివృద్ధి చేసింది. ఈ టైర్ ట్రాఫిక్‌ లో మంచి స్థిరత్వం, అద్భుతమైన బ్రేకింగ్ పనితీరు, అన్ని రకాల రోడ్డు పరిస్థితులను అనుకూలంగా ఉండటంతో పాటు దీర్ఘకాలిక మన్నిక అందించే లక్ష్యంతో వీటిని రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది.

Advertisement

అటు, BKT థైరోస్ టైర్లను గుంతలతో కూడిన రోడ్లతో పాటు రహదారుల మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా తయారు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ టైర్లు ఆన్, ఆఫ్ రోడ్ ఉపయోగం కోసం ఉద్దేశించబడ్డాయి. ఇవి నగర పరిమితులను దాటి ప్రయాణించే వారికి, గతుకుల రోడ్లతో పాటు కఠినమైన ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు అనుకూలంగా ఉంటాయి. BKT తాజాగా లాంచ్ చేసిన రెండు టైర్ లైన్లు భారత్ లోనే తయారు చేయబడ్డాయి. ఈ మోడల్స్ బైక్స్, స్కూటర్ విభాగాలకు ఉపయోగపడుతాయి.

Read Also: కొత్త దేశీ కారు బ్రాండ్ వచ్చేస్తోంది, అట్టహాసంగా JSW మోటార్స్ అనౌన్స్ మెంట్!

ఇండోర్ లో టైర్ల పరీక్షలు పూర్తి

Advertisement

BKT తాజాగా తీసుకొచ్చిన రెండు రకాల టైర్లకు సంబంధించి ఇండోర్‌ లో ఉన్న ప్రభుత్వ పరీక్షా కేంద్రం NATRAXలో వెహికిల్ లెవెల్ ట్రయల్స్‌ తో సహా టైర్లు విస్తృతమైన ధ్రువీకరణకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయని కంపెనీ వెల్లడించింది. ఈ పరీక్షలలో తడి, పొడి బ్రేకింగ్ అసెస్‌మెంట్లు, రైడ్ క్వాలిటీ ఎవల్యూషన్, హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ పరీక్షలు అన్నింటిలో తమ కంపెనీ టైర్లు పాస్ అయినట్లు తెలిపింది. అంతేకాదు, వీటికి BIS సర్టిఫికేషన్ లభించినట్లు వివరించింది. ఈ రెండు రకాల టైర్లు భారతీయ నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని NATRAX నిర్థారించినట్లు BKT తెలిపింది. తమ కంపెనీ ఇకపై కొత్త అధ్యయాన్ని మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.

Read Also: TVS టాంజెంట్ RR కాన్సెప్ట్ డిజైన్‌కు పేటెంట్, అపాచీ RR 450కు అదే డిజైన్ వాడుతారా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×