E-Paper
Advertisement

బీఎండబ్ల్యూ F 450 GS ప్రీ బుకింగ్స్ షురూ! లాంచింగ్ ఎప్పుడంటే?

బీఎండబ్ల్యూ F 450 GS ప్రీ బుకింగ్స్ షురూ! లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

BMW F 450 GS Bookings Open: భారతీయ అడ్వెంచర్ బైక్ మార్కెట్‌ లోకి BMW మరో క్రేజీ బైక్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. F 450 GS పేరుతో ఈ బైక్ ను లాంచ్ చేయనుంది. ఈ బైక్ విడుదలకు ముందు నుంచే ఆసక్తి కలిగిస్తోంది. ఈ బైక్ అధికారికంగా ఏప్రిల్ 23న లాంచ్ కానుండగా, ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే   BMW Motorrad డీలర్‌ షిప్‌ ను సందర్శించి ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది.

BMW G 310 GS స్థానంలోకి ఎంట్రీ!

ఈ కొత్త మోడల్, ప్రస్తుతం మార్కెట్‌ లో నిలిపివేసిన BMW G 310 GS స్థానాన్ని భర్తీ చేయనుంది. అదే సమయంలో, ఇది ఇప్పటికే ఉన్న బలమైన ప్రత్యర్థులు అయిన KTM 390 అడ్వెంచర్, రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450కి గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఈ బైక్‌ను జర్మన్ కంపెనీ BMW,  భారత్ కు చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ కలిస అభివృద్ధి చేశాయి. ఈ బైక్ తమిళనాడులోని హోసూర్ ప్లాంట్‌ లో తయారు చేస్తున్నారు.

BMW F 450 GS డిజైన్ గురించి..  

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, ఈ బైక్ పెద్ద మోడల్ అయిన BMW R 1300 GS నుంచి ప్రేరణ పొందింది. అయితే, ఇది మరింత చిన్నదిగా, కాంపాక్ట్ రూపంలో ఉండేలా తయారు చేశారు. అయినప్పటికీ, GS సిరీస్‌ కు ప్రత్యేకమైన స్టైల్ ఇందులో కనిపిస్తుంది. ముందు భాగంలో 19 అంగుళాల వీల్, వెనుక భాగంలో 17 అంగుళాల వీల్ ఉంటుంది. ఈ సెటప్ రోడ్డు మీద మాత్రమే కాదు, ఆఫ్ రోడ్ ట్రైల్స్‌ లో కూడా మంచి పనితీరును కలిగి ఉంటుంది. సస్పెన్షన్ సిస్టమ్ కూడా బలంగా ఉంటుంది. ముందువైపు USD ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ వల్ల గతుకుల రోడ్లు, ఇబ్బందికర మార్గాలు రెండింటిలోనూ బైక్ చక్కగా నడుస్తుంది. డ్యూయల్ పర్పస్ టైర్లు కూడా దీనికి మంచి గ్రిప్‌ను అందిస్తాయి.

BMW F 450 GS ఇంజిన్ గురించి..

ఇంజన్ పరంగా చూస్తే, ఈ బైక్‌ లో 420cc సామర్థ్యంతో కూడిన ప్యారలల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,750rpm దగ్గర సుమారు 48bhp పవర్, 6,750rpm దగ్గర 43Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో ఇది పని చేస్తుంది. అలాగే స్లిప్పర్ క్లచ్, క్విక్‌ షిఫ్టర్ లాంటి ఆధునిక ఫీచర్లు స్టాండర్డ్‌ గా అందిస్తాయి. ఇవి గేర్ మార్పులను మరింత స్మూత్ గా మార్చుతాయి.

నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి!

Advertisement

ఈ బైక్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బేసిక్, ఎక్స్‌ క్లూజివ్, స్పోర్ట్, GS ట్రోఫీ. వీటిలో GS ట్రోఫీ వేరియంట్ ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ కోసం తయారు చేయబడింది. ఇందులో ట్యూబ్‌ లెస్ వైర్ స్పోక్ వీల్స్, ప్రత్యేకమైన టైర్లు ఉంటాయి.

ధర ఎంత అంటే?

ఇక ధర విషయానికి వస్తే, ఈ బైక్ ప్రారంభ ధర సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, కొత్త ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ బైక్ అడ్వెంచర్  బైక్ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా మారే అవకాశం ఉంది.

Read Also: సింపుల్ అల్ట్రా vs ఏథర్ 450 అపెక్స్.. రెండు ఈవీలలో ఏది బెస్ట్?

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×