E-Paper
Advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పడిపోదు.. భారత్‌లో కొత్త BMW మోడల్ కు పేటెంట్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పడిపోదు.. భారత్‌లో కొత్త BMW మోడల్ కు పేటెంట్!
Advertisement

BMW Self Balancing Scooter: జర్మనీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BMW మోటోరాడ్ క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ విజన్ CE కోసం భారత్ లో డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది. ఈ స్కూటర్‌ లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో పాటు రైడర్ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రత్యేక నిర్మాణం ఉండబోతోంది. అయితే, భారత్‌ లో ఈ స్కూటర్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు.

IAA మొబిలిటీ 2025లో తొలిసారి ప్రదర్శన

BMW విజన్ CEను తొలిసారిగా 2025లో జరిగిన IAA మొబిలిటీ ప్రదర్శనలో ఆవిష్కరించింది. సిటీ ప్రయాణాలకు అనువుగా, భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కాన్సెప్ట్‌ను రూపొందించింది. సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లకు భిన్నంగా ఇందులో రైడర్ సేఫ్టీ కోసం ప్రత్యేకమైన ట్యూబులర్ మెటల్ కేజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్‌కు భారత్ లో డిజైన్ పేటెంట్ దాఖలు చేయడం ఆసక్తిని పెంచుతోంది.

స్కూటర్ పడిపోకుండా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ

Advertisement

విజన్ CEలో అందరినీ ఆకట్టుకునే అంశం సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్. సాధారణ స్కూటర్లలో వాహనం ఆగినప్పుడు బ్యాలెన్స్ కోసం రైడర్ కాళ్లను నేలపై పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఈ కాన్సెప్ట్‌ లోని ప్రత్యేక వ్యవస్థ స్కూటర్ ఆగినా, నిటారుగా ఉండేలా రూపొందించారు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేదంటే వాహనాన్ని ఆపినప్పుడు బ్యాలెన్స్ చేయడం మరింత ఈజీ కావచ్చు. అయితే, ఈ టెక్నాలజీ పనితీరు, సామర్థ్యం గురించి BMW పూర్తి టెక్నికల్ వివరాలను వెల్లడించలేదు.

సీట్‌ బెల్ట్‌ తో కూడిన ప్రత్యేక డిజైన్

విజన్ CEలో రైడర్ భద్రత కోసం ట్యూబులర్ స్టీల్ కేజ్, నాలుగు పాయింట్ల సీట్‌ బెల్ట్‌ ను అందించారు. సాధారణ టూ వీలర్స్ లో కనిపించని ఈ నిర్మాణం రైడర్‌కు అదనపు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించారు. ఈ డిజైన్‌ను BMW గతంలో తీసుకొచ్చిన C1 స్కూటర్‌తో పోల్చవచ్చు. ఆ మోడల్‌ లో కూడా రైడర్‌ కు రక్షణ కల్పించే నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, విజన్ CEలో హెల్మెట్ అవసరం లేదనే భావన ఉన్నప్పటికీ, ఉత్పత్తి మోడల్‌కు సంబంధించిన భద్రతా నిబంధనలు, హెల్మెట్ వినియోగం గురిం పూర్తి వివరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్ గురించి..

Advertisement

విజన్ CE పూర్తిగా విద్యుత్‌ తో నడిచే వాహనంగా రూపొందించారు. అయితే, బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, రేంజ్, ఛార్జింగ్ సమయం లాంటి వివరాలను BMW వెల్లడించలేదు. దీని డిజైన్‌లో తక్కువ ఎత్తు, పొడవైన వీల్‌బేస్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రస్తుతం BMW మోటోరాడ్ భారత్ లో CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను రూ.15.25 లక్షల ఎక్స్‌ షోరూమ్ ధరకు విక్రయిస్తోంది. విజన్ CE ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? భారత్‌లో విడుదల అవుతుందా? అనే విషయాలపై కంపెనీ నుంచి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Read Also: హ్యుందాయ్ బేయాన్ ధర రేపే విడుదల.. బేసిక్ మోడల్ రేటు ఎంత ఉండొచ్చంటే?

Tags

Related News

ఏప్రిలియా RS 660 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది, రేసింగ్ లుక్ అదుర్స్!

హ్యుందాయ్ బేయాన్ ధర రేపే విడుదల.. బేసిక్ మోడల్ రేటు ఎంత ఉండొచ్చంటే?

సింపుల్ వేవ్ ఈవీలపై సూపర్ ఫెస్టివ్ ఆఫర్లు, బాబోయ్.. అంత తగ్గింపా?

డెంజా లాంచ్ డేట్ ఫిక్స్.. 600 కి.మీ. రేంజ్‌ తో అదరగొట్టేలా!

మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!

సింగిల్ ఛార్జింగ్‌తో 343 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×