E-Paper
Advertisement

కాంకోర్డ్ ఫ్లైట్ స్టైల్‌ లో BMW కొత్త K 18 బైక్.. వారెవ్వా ఏముంది భయ్యా!

కాంకోర్డ్ ఫ్లైట్ స్టైల్‌ లో BMW కొత్త K 18 బైక్.. వారెవ్వా ఏముంది భయ్యా!
Advertisement

BMW Vision K 18 Touring Bike Concept: లేక్ కోమోలో జరిగిన ప్రతిష్టాత్మకమైన కాంకోర్సో డి ఎలెగాంజా విల్లా డి ఎస్టే ఈవెంట్‌ లో BMW మోటోరాడ్ కొత్త కాన్సెప్ట్ బైక్  విజన్ K 18ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ బైక్ సాధారణ టూరింగ్ మోటార్‌ సైకిళ్లలా కాకుండా, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ తో రూపొందించింది. ముఖ్యంగా ఇందులో ఉపయోగించిన భారీ 1,800cc ఇన్‌లైన్ సిక్స్ ఇంజన్ ఈ కాన్సెప్ట్‌ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సూపర్‌ సోనిక్ విమానం BAC కాంకోర్డ్ స్పూర్తితో..

ఈ కాన్సెప్ట్ డిజైన్‌ కు ప్రసిద్ధ సూపర్‌ సోనిక్ విమానం BAC కాంకోర్డ్ నుంచి స్ఫూర్తి పొందినట్లు BMW వెల్లడించింది. అందుకే ఈ బైక్ చాలా పొడవుగా, సన్నగా కనిపించే ప్రత్యేకమైన లుక్ ను కలిగి ఉన్నట్లు చెప్పింది. ఈ బైక్ ముందు భాగం నుంచి వెనుక వరకు ఏరోడైనమిక్ స్టైల్‌ లో తీర్చిదిద్దారు. చూసే వారికి ఇది రోడ్డు మీద నడిచే ఫ్యూచరిస్టిక్ మెషీన్ లా కనిపిస్తుంది.

ఆరు సిలిండర్ల ఇంజన్‌ హైలైట్

Advertisement

విజన్ K 18లోని డిజైన్ ఎలిమెంట్స్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఆరు సిలిండర్ల ఇంజన్‌ను హైలైట్ చేయడానికి ఇందులో ఆరు LED లైట్ ఎలిమెంట్స్, ఆరు ఎయిర్ ఇన్‌ టేక్ ట్యూబ్స్, అలాగే ఆరు ఎగ్జాస్ట్ అవుట్‌ లెట్స్‌ ను ఇచ్చారు. ఇవి బైక్‌ కు మరింత అగ్రెసివ్, ప్రీమియం లుక్‌ ను తీసుకొచ్చాయి. బాడీ ప్యానెల్స్‌ ను చేతితో తయారు చేసిన అల్యూమినియంతో రూపొందించగా, కొన్ని భాగాల్లో ఫోర్జ్డ్ కార్బన్ మెటీరియల్‌ ను ఉపయోగించారు. దీంతో బైక్‌ తక్కువ బరువు, ఎక్కువ బలం కలిగి ఉంటుంది.

భవిష్యత్‌లో BMW మోడల్స్ అన్నీ ఈ డిజైన్ తోనే..

సస్పెన్షన్ సెటప్ కూడా ఈ కాన్సెప్ట్‌ లో ప్రత్యేకంగా ఉంది. హైడ్రాలిక్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ద్వారా రైడింగ్ అవసరాలకు అనుగుణంగా సస్పెన్షన్‌ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల హై స్పీడ్ రైడింగ్ సమయంలో మరింత స్టెబులిటీ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం BMW దగ్గర ఉన్న ఇన్‌ లైన్ సిక్స్ టూరింగ్ బైక్స్ ఎక్కువగా సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం తయారయ్యాయి. కానీ, విజన్ K 18 మాత్రం పూర్తిగా పర్ఫార్మెన్స్, స్టైల్,  ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ పై దృష్టి పెట్టింది. ఇది ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో BMW విడుదల చేసే కొత్త ఇన్‌ లైన్ సిక్స్ మోటార్‌ సైకిళ్ల డిజైన్‌ పై దీని ప్రభావం ఉండొచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

విజన్ K 18 కాన్సెప్ట్ ద్వారా BMW మోటోరాడ్ తన సాంకేతిక నైపుణ్యాన్ని, డిజైన్‌ లో కొత్త ఆలోచనలను మరోసారి చూపించింది. ఈ బైక్ భవిష్యత్ టూరింగ్ బైక్స్ ఎలా ఉండబోతున్నాయో ముందుగానే చూపించే ఒక గ్లింప్స్‌ లా కనిపిస్తోంది.

Read Also: తక్కువ ధరలో బెస్ట్ EV స్కూటర్లు.. మంచి రేంజ్‌ తో టాప్ 5 మోడళ్లు!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×