E-Paper
Advertisement

EVలకు మారిన బాలీవుడ్ స్టార్లు.. ఏ హీరో దగ్గర ఏ ఎలక్ట్రిక్ కారు ఉందో తెలుసా?

EVలకు మారిన బాలీవుడ్ స్టార్లు.. ఏ హీరో దగ్గర ఏ ఎలక్ట్రిక్ కారు ఉందో తెలుసా?
Advertisement

Bollywood Celebrities EV Choices: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకు మరింత వేగంగా పెరుగుతోంది. సాధారణ వినియోగదారులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇప్పుడు EVల వైపు అడుగులు వేస్తున్నారు. లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్లు, ప్రీమియం SUVలతో పాటు చిన్న సిటీ EVలను కూడా తమ గ్యారేజీల్లో చేర్చుకుంటున్నారు. ఇంతకీ బాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర ఉన్న ఈవీలు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ షారుఖ్ ఖాన్: హ్యుందాయ్ ఐయోనిక్ 5

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హ్యుందాయ్ ఐయోనిక్ 5ను వాడుతున్నారు. ఆకట్టుకునే డిజైన్, విశాలమైన క్యాబిన్, ఎక్కువ రేంజ్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ క్రాస్‌ ఓవర్ మంచి ఆదరణ పొందింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది.

⦿ రణవీర్ సింగ్: GMC హమ్మర్

Advertisement

రణవీర్ సింగ్ GMC హమ్మర్ EVని వాడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ భారీ ఎలక్ట్రిక్ వాహనం అత్యంత శక్తివంతమైన EVలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని ఆకర్షణీయమైన డిజైన్, బలమైన పనితీరు అందరినీ ఆకట్టుకుంటాయి.

⦿ సునీల్ శెట్టి: MG కామెట్ EV

సునీల్ శెట్టి మాత్రం సాధారణ నగర ప్రయాణాల కోసం MG కామెట్ EVను ఉపయోగిస్తున్నారు. చిన్న పరిమాణం, సులభమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా సిటీ ట్రాఫిక్ లో ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రయాణాలకు అనువైన EVగా కామెట్ పేరు తెచ్చుకుంది.

⦿ రేఖ: BMW i7

Advertisement

ప్రముఖ నటి రేఖ తన గ్యారేజీలో BMW i7ను చేర్చుకున్నారు. లగ్జరీ సెడాన్ విభాగంలో అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లలో   ఒకటిగా కొనసాగుతోంది. అత్యాధునిక ఫీచర్లు,సౌండ్ ప్రూఫ్ క్యాబిన్, హై రేంజ్ దీని ప్రత్యేకతలు.

⦿ మాధురీ దీక్షిత్: టాటా నెక్సాన్

మాధురీ దీక్షిత్ మరియు ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే టాటా నెక్సాన్ EVను ఉపయోగిస్తున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ SUVలలో నెక్సాన్ EV ఒకటి. సరసమైన ధర, మంచి రేంజ్, ఆధునిక ఫీచర్ల కారణంగా ఈ కారు అమ్మకాల్లో దూసుకెళ్తోంది.

⦿ జెనీలియా: BMW iX

రితేష్ దేశ్‌ ముఖ్, జెనీలియా దంపతులు BMW iXను తమ గ్యారేజీలో చేర్చుకున్నారు. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ SUV ఆధునిక టెక్నాలజీ, విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

⦿ మందిరా బేడీ

మందిరా బేడీ కూడా EVలపై ఆసక్తి చూపుతున్నారు. తొలుత టాటా నెక్సాన్ EVను ఉపయోగించిన ఆమె, తర్వాత వోల్వో C40 రీఛార్జ్‌ కు అప్‌ గ్రేడ్ అయ్యారు. ఈ కూపే స్టైల్ ఎలక్ట్రిక్ SUV డిజైన్, పనితీరు పరంగా మంచి గుర్తింపు పొందింది.

⦿ అనురాగ్ కశ్యప్

ఇక దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటులు కుబ్రా సైత్, బోమన్ ఇరానీ లాంటి ప్రముఖులు మహీంద్రా XEV 9Eను కొనుగోలు చేశారు. మహీంద్రా న్యూ జెనరేషన్ ఎలక్ట్రిక్ SUVలపై సెలబ్రిటీల ఆసక్తి కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Read Also: టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. హారియర్ EVకి రూ.2.75 లక్షల తగ్గింపు!

Related News

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×