Youth Movement: బటర్ ఫ్లై ఎఫెక్ట్ ఫిలాసఫీ కాన్సెప్ట్ గురించి తెలుసా? ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఓ చిన్న సీతాకోకచిలుక తన రెక్కలను ఆడించడం వల్ల, మరెక్కడో ఒకచోట ఊహించని పెద్ద తుఫాను రావచ్చు అంటారు. ఇప్పుడు.. ఇండియాలోనూ అలాంటిదే జరిగింది. కాకపోతే ఇది కాక్రోచ్ ఎఫెక్ట్. ఎస్ సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీలో జెన్ జీ యూత్ అంతా ధర్నాకు దిగే దాకా తీసుకొచ్చాయ్. ఇది ఎక్కడిదాకా వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఇండియాలో రీసౌండ్ వస్తోంది. దేశం మొత్తం దీని గురించే చర్చించుకుంటోంది. సీజేఐ చేసిన ఒక్క కామెంట్ ఊహించని పరిణామాలకు దారితీస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇంత పెద్ద మార్పు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు. క్రాకోచ్ అనే ఒక చిన్న మాట చైన్ రియాక్షన్‌లా మారి జెన్ జీ మొత్తాన్ని కదిలిస్తుందని సోషల్ మీడియా ఉద్యమం కాస్తా వీధి పోరాటాలకు బాటలు వేస్తుందని ఎవరనుకున్నారు? కానీ అదే జరుగుతోందిప్పుడు.
భారతదేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగింది. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ OSM వ్యవస్థలో అవకతవకలతో ఈ ఆందోళనలని చేపట్టింది. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపుమేరకు.. వేలాది మంది యువత నిరసన వేదిక దగ్గరకు తరలివచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేము మేకిన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారంటూ నినాదాలు చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం ఈ నిరసన ఓ ముందడుగు అన్నారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు.. అమెరికాలోని బోస్టన్ నుంచి ఢిల్లీకి వచ్చాడు అభిజీత్ దీప్కే. అంబేద్కర్ జీవిత చరిత్రని చేతిలో పట్టుకొని కనిపించారు. ఢిల్లీలో సీజేపీ మద్దతుదారులు చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జంతర్ మంతర్‌లో వాళ్లిచ్చిన స్లోగన్స్ ఇండియా అంతటా వినిపించాయ్.
పేపర్ లీక్‌లు, వాటి వెనుక జరుగుతున్న అవకతవకలను అరికట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం కాక్రోజ్ జనతా పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలపై దృష్టి సారిస్తోందని, పోస్టులు డిలీట్ చేస్తోందని అభిజీత్ విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నెలరోజులుగా డిమాండ్ చేస్తున్నా దానిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. బదులుగా సీజేపీ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని, తమ పోస్టులను తొలగిస్తున్నారని చెప్పారు. మా పోస్టులు తొలగించగలరేమో గానీ తమను తొలగించలేరని చెప్పారు అభిజీత్ దీప్కే. బొద్దింకలు భయపడవని, అవి ఎప్పటికీ చావవని చెప్పారు. అదేవిధంగా భారతదేశ యువత కూడా ఇకపై దేనికీ భయపడదని తామంతా కలిసి పోరాడతామని చెప్పారు.
Also read: ఇండియన్ మార్కెట్‌పై హోండా ఫోకస్.. 2030 నాటికి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!
కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అయిన సెటైరికల్ పొలిటికల్ మూమెంట్. కేవలం ఓ జోక్‌గా, మీమ్ పేజ్‌గా మొదలైన ఈ పార్టీ కొద్దిరోజుల్లోనే కోట్లాది మంది భారతీయ యువతని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతి పార్టీ పుట్టుకకు ఓ బలమైన కారణం ఉన్నట్లే సీజేపీ ఆవిర్భావానికి కూడా ఓ కీలక కారణముంది. గత మే 15న.. సుప్రీంకోర్టు విచారణలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు రాక, సమాజంలో సరైన స్థానం దక్కక కొందరు యువత.. సోషల్ మీడియా యాక్టివిస్టులుగా మారి వ్యవస్థలపై దాడులు చేస్తున్నారన్నారు. వారిని సెటైరికల్‌గా బొద్దింకలతో పోలుస్తూ సమాజ పరాన్నజీవులని అన్నారు. ఆ తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వివరణ ఇచ్చినప్పటికీ.. దేశంలోని నిరుద్యోగ యువత దీనిని తమకు జరిగిన అవమానంగా భావించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా పుట్టుకొచ్చిందే.. కాక్రోచ్ జనతా పార్టీ.
సీజేఐ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల అభిజీత్ దీప్కే అనే యువకుడు.. మే 16న ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఓ అకౌంట్ తెరిచాడు. ఇతను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లో పనిచేశఆరు. ప్రస్తుతం.. అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్నారు. చీఫ్ జస్టిస్ అన్నట్లు మేమంతా బొద్దింకలమే. దేశంలోని నిరుద్యోగులు, బద్ధకస్తుల కోసం.. ఈ సరికొత్త ప్లాట్ ఫామ్ అంటూ అభిజీత్ పెట్టిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. బొద్దింక అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని బతకగలదు కాబట్టి, దానిని యువత ఓర్పుకు, పోరాటానికి చిహ్నంగా వాడుకున్నారు. సీజేపీ స్లోగన్ ఒక్కటే యూత్ కోసం యూత్ చేత ఏర్పడిన పొలిటికల్ ఫ్రంట్ అని ప్రచారం చేశారు. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ప్రభుత్వాల వైఫల్యాలపై ఈ పేజీలో వేసిన మీమ్స్ సెటైర్లు జెన్ జీ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయ్. అంతే వారం లోపే ఫాలోవర్ల సంఖ్య కోటిన్నర దాటిపోయింది. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. దేశంలోనే అతిపెద్ద అధికార పార్టీ అయిన బీజేపీ, ప్రధాన ప్రతిఫక్షం కాంగ్రెస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యని కూడా కాక్రోచ్ జనతా పార్టీ దాటేసి టాప్‌లోకి దూసుకెళ్లింది. లక్షలాది మంది యువత గూగుల్ ఫామ్స్ ద్వారా సభ్యులుగా చేరారు. కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా దీనికి మద్దతు తెలిపారు.
సోషల్ మీడియాలో జోక్‌గా, డిజిటల్ ప్రొటెస్ట్‌గా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ.. అతి తక్కువ సమయంలోనే.. యువతలో ఉన్న అసంతృప్తికి ఓ పెద్ద గొంతుకగా మారింది. ఇప్పుడు.. సోషల్ మీడియాని దాటి.. నీట్ పేపర్ లీకేజీలు, ప్రభుత్వ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా.. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర శాంతియుత నిరసనలు, ధర్నాలు చేసే స్థాయికి చేరుకుంది. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే కూడా అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చి.. ఈ యూత్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర తొలి నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ.. మరో భారీ నిరసనకు ప్రణాళిక రచిస్తోంది. ఇదే నెల 23న.. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఓ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Storey By: Appa Rao BiG Tv