E-Paper
Advertisement

Dog Adoption: కేబీఆర్ పార్క్‌లో సందడిగా ‘డాగ్ అడాప్షన్ డ్రైవ్’.. 130 కుక్కలను దత్తత తీసుకున్న ఎంపీ!

Dog Adoption: కేబీఆర్ పార్క్‌లో సందడిగా ‘డాగ్ అడాప్షన్ డ్రైవ్’.. 130 కుక్కలను దత్తత తీసుకున్న ఎంపీ!
Advertisement

Dog Adoption: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వేదికగా డాగ్ అడాప్షన్ పై నిర్వహించిన కార్యక్రమం జంతు ప్రేమికులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ రేణుక చౌదరి పాల్గొని జంతువుల పట్ల ఉండాల్సిన బాధ్యతను, వాటి ప్రాముఖ్యతను వివరించారు.

ప్రస్తుతం నగరాల్లో వీధి కుక్కల సంఖ్య పెరగడం, అవి ప్రజలపై దాడులు చేయడం వంటి ఘటనల నేపథ్యంలో రేణుక చౌదరి ఈ అడాప్షన్ కార్యక్రమాన్ని సమర్థించారు. కుక్కలను హింసించడం కంటే, వాటిని చేరదీసి పెంచుకోవడం సరైన పరిష్కారమని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సుమారు **130 కుక్కలను** దత్తత తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన కుటుంబానికి జంతువులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. తన కుమార్తె ‘పిక్సీ’ అనే కుక్కను తన ఇంటికి తీసుకువచ్చిందని, తమ ఇంట్లో ఎప్పుడూ జంతువులు ఉంటూనే ఉంటాయని తెలిపారు.

Advertisement

కుక్కలు కేవలం పెంపుడు జంతువులు మాత్రమే కాదని.. అవి మనుషుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఏదైనా ఆపద సమయంలో పోలీసులు రావడానికి 10 నిమిషాలు పట్టవచ్చు.. కానీ ఇంట్లో ఉండే కుక్క తక్షణమే స్పందించి ప్రాణాలను కాపాడుతుంది. కుక్కలను పెంచడం వల్ల రక్తపోటు (BP) తగ్గుతుందని.. ఆటిజం ఉన్న పిల్లలకు అవి మంచి మిత్రులుగా మారుతాయని చెప్పారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు బయటకు వెళ్లినప్పుడు ఇవి తోడుగా ఉండి సహాయపడతాయని తెలిపారు.

అదే విధంగా.. భారతీయ చరిత్ర, పురాణాల్లో కుక్కలకు విశిష్ట స్థానం ఉందని ఆమె గుర్తుచేశారు. యముడి వద్ద రెండు కుక్కలు ఉంటాయని, అలాగే కుక్కను కాలభైరవ స్వరూపంగా భావిస్తామని తెలిపారు. అందుకే తాము కుక్కలకు కూడా నామాలు పెడతామని చెప్పారు. నేపాల్ వంటి దేశాల్లో కుక్కల కోసం ప్రత్యేక దినోత్సవం జరుపుకుంటారని.. అక్కడ వాటిని పూజిస్తారని ఉదాహరణగా పేర్కొన్నారు. చివరగా.. ఏ సుప్రీంకోర్టు కూడా కుక్కలను చంపమని చెప్పలేదని, వాటిని ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Also Read: వాలెంటైన్స్ డే సాక్షిగా వారిది ‘అక్రమ సంబంధం’.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్!

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×