E-Paper
Advertisement

India’s Cheapest CNG Car: సెలెరియో To వ్యాగన్ R.. సూపర్ మైలేజ్ ఇచ్చే బెస్ట్ CNG కార్లు!

India’s Cheapest CNG Car: సెలెరియో To  వ్యాగన్ R.. సూపర్ మైలేజ్ ఇచ్చే బెస్ట్ CNG కార్లు!
Advertisement

India’s cheapest CNG Car 2026: దేశంలో చాలా మంది కొనుగోలుదారులు మంచి మైలేజ్, ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న ఇంధన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, సరసమైన రోజువారీ ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. CNG కార్లు అన్ని ఇంధన రకాలలో  అతక్కువ రన్నింగ్ ఖర్చును కలిగి ఉన్నాయి. దేశంలో అత్యంత సరసమైన CNG మోడల్స్ కొన్ని 30 కి.మీ, అంతకంటే ఎక్కువ మైలేజీని అందిస్తున్నాయి. రోజువారీ నగర ప్రయాణానికి, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి.

కేజీకి 34.43 కిలో మీటర్ల ప్రయాణం

దేశంలోని పలు CNG కార్లు అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మారుతి సుజుకి సెలెరియో CNG మోడ్‌లో కేజీకి దాదాపు 34.43 కి.మీ ప్రయాణ అవకాశాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ హ్యాచ్ బ్యాక్ గా గుర్తింపు తెచ్చుకుంది. మారుతి సుజుకి సెలెరియో CNG ధర రూ. 5,97,900 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ది 5,300 rpm దగ్గర 56.70 PS (41.7 kW)  పవర్, 3,400 rpm దగ్గర 82.1 Nm టార్క్‌ ను అందిస్తుంది.

Advertisement

అటు మారుతి సుజుకి వ్యాగన్ R CNG  కూడా సుమారు 34 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. మారుతి సుజుకి ఆల్టో K10 CNG దాదాపు 33.85 కిలో మీటర్ల మైలేజీని ఇస్తున్నాయి. ఈ కార్లు కూడా అత్యంత సరసమైన ధరలకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సుమారు రూ. 5.7 లక్షల నుంచి రూ. 7.5 లక్షల మధ్య ఉంటుంది.

ఇంజిన్, పనితీరు

అధిక సామర్థ్యం గల CNG కార్లు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో నడపడానికి అనువుగా ఉండే చిన్న పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంటాయి. ఆల్టో K10, వ్యాగన్ R మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో జత చేయబడిన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటాయి.  ఇవి పూర్తి పనితీరు కోసం కాకుండా ప్యూయెల్ ఎఫిషియెన్సీ కోసం రూపొందించబడ్డాయి. ఈ ఇంజన్లు అధిక వేగం కోసం రూపొందించబడనప్పటికీ,  నగర డ్రైవింగ్, సున్నితమైన ట్రాఫిక్ పరిస్థితులకు తగినంత శక్తిని అందిస్తాయి. అందుకే, చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ వినియోగదారులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు.

Advertisement

Read Also: ఎర్లీ మార్నింగ్ vs లేట్ నైట్.. ఏ టైమ్ లో డ్రైవింగ్ చేయడం బెస్ట్?

ఫీచర్లు, సౌకర్యం

తక్కువ ధరలు ఉన్నప్పటికీ, CNG కార్లు రోజువారీ వినియోగానికి అవసరమైన అన్ని ఫీచర్లను కలిగి ఉంటాయి. ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగ్‌లు, మ్యూజిక్ సిస్టమ్‌ లాంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తాయి. హై స్పెక్ వేరియంట్లలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లేతో టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు, భద్రత కోసం EBDతో ABS, బ్యాక్  పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. మైలేజ్, ఫీచర్లు తొలిసారి కారు కొనుగోలు చేసేవారికి, చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయి.

Read Also: ఎలక్ట్రిక్ రోడ్లు వచ్చేస్తున్నాయ్, దానిమీద వెళ్తే ఆటోమేటిక్ గా ఈవీలు ఛార్జింగ్ అవుతాయి!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×