E-Paper
Advertisement

Suzuki Motorcycle- Royal Brothers: చేతులు కలిపిన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా, రాయల్ బ్రదర్స్‌.. ప్లాన్ మామూలుగా లేదుగా!

Suzuki Motorcycle- Royal Brothers: చేతులు కలిపిన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా, రాయల్ బ్రదర్స్‌.. ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Suzuki Motorcycle India–Royal Brothers Deal: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా.. భారతీయ మార్కెట్ లో తన పరిధిని మరింతగా పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సుజుకి టూ వీలర్స్ కోసం సౌకర్యవంతమైన రెంటెల్, సబ్‌ స్క్రిప్షన్ ఆప్షన్స్ ను అందించడానికి రాయల్ బ్రదర్స్ రెంటల్స్‌ తో జోడీ కట్టింది. వినియోగదారులు 24 గంటల నుంచి 12 నెలల వరకు సుజుకి బైక్‌లను రెంట్ కు తీసుకోవచ్చు. కొనుగోలుకు ముందు టెస్ట్ డ్రైవింగ్ కోసం ఈ విధానం ఉపయోగపడనుంది. ఈ భాగస్వామ్యం సుజుకి ఎలక్ట్రిక్ ఆఫర్లతో ఎంగేజ్ మెంట్ ను కూడా పెంచుతుంది. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఒక రోజు నుంచి ఏడాది వరకు..

సుజుకి టూవీలర్స్ కు సౌకర్యవంతమైన రెంటెల్, సబ్‌ స్క్రిప్షన్ సర్వీసుల ద్వారా యాక్సెస్ ను పెంచేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ఈ సహకారం సుజుకి ఇ-యాక్సెస్‌ తో ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ఇతర సుజుకి టూవీలర్స్ కు విస్తరించనున్నాయి. కస్టమర్లు రాయల్ బ్రదర్స్ రెంటల్స్ ప్లాట్‌ ఫామ్ ద్వారా ఒక రోజు నుంచి 1 సంవత్సరం వరకు సౌకర్యవంతమైన రెంటెల్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఆయా అవసరాలకు అనుగుణంగా అద్దెకు తీసుకునే అవకాశం ఉంటుంది. స్వల్పకాలిక వినియోగం, దీర్ఘకాలిక సబ్‌ స్క్రిప్షన్ ద్వారా సుజుకి వాహనాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

కీలక విషయాలు వెల్లడించిన సుజుకి టూ వీలర్స్ ఇండియా

Advertisement

రెండు కంపెనీల మధ్య ఒప్పందం గురించి SMIPL సేల్స్ & మార్కెటింగ్  వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా కీలక విషయాలు వెల్లడించారు. “మొబిలిటీ ప్రాధాన్యతలు పెరుగుతున్నారు. చాలా మంది కస్టమర్లు ఏదైనా ఒక ప్రొడక్ట్ ను కొనే ముందు దాని గురించి ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. రియల్ వరల్డ్ అనుభవాన్ని కోరుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగానే ఒప్పందం జరిగింది. ఈ చొరవతో ఎలక్ట్రిక్ ఆఫర్‌  ఎంగేజ్ మెంట్ ను బలోపేతం చేస్తూ, యాక్సెసిబిలిటీని పెంచుతుంది” అని వివరించారు.

Read Also: హోండా To యమహా.. మహిళలకు సూటయ్యే బెస్ట్ స్కూటర్లు ఇవే!

రాయల్ బ్రదర్స్ ఏం చెప్పిందంటే?

Advertisement

అటు రాయల్ బ్రదర్స్ రెంటల్స్ కో ఫౌండర్, CEO అభిషేక్ చంద్రశేఖర్ ఈ ఒప్పందం గురించి సంతోషం వ్యక్తం చేశారు. “ఈ సహకారం సుజుకి నమ్మకమైన ఇంజనీరింగ్, మా బలమైన ఆన్ గ్రౌండ్ నెట్‌ వర్క్‌ కలిపి కస్టమర్లు ఎలక్ట్రిక్ మొబిలిటీని ఎక్స్ పీరియెన్స్ చేసేందుకు ఉపయోగపడనుంది” అన్నారు.

Read Also:  నెల రోజుల్లో 5.58 లక్షల బైక్స్ సేల్.. అదరగొట్టిన హీరో మోటోకార్ప్!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×