E-Paper
Advertisement

జస్ట్ 5 నిమిషాల్లో ఛార్జ్.. BYD నుంచి కళ్లు చెదిరే అట్టో 3 కొత్త వెర్షన్ లాంచ్!

జస్ట్ 5 నిమిషాల్లో ఛార్జ్.. BYD నుంచి కళ్లు చెదిరే అట్టో 3 కొత్త వెర్షన్ లాంచ్!
Advertisement

5-Minute Charge EV BYD Atto 3: చైనీస్ ఆటో దిగ్గజం BYD.. తన పాపులర్ ఎలక్ట్రిక్ SUV అట్టో 3కి కొత్త వెర్షన్‌ ను లాంచ్ చేసింది. ఈ కారు జస్ట్ 5 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది. ఆస్ట్రేలియాలో మొదటిసారి విడుదలైన ఈ కారు, తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. చైనాలో దీన్ని  యాన్ ప్లస్ లేదంటే యువాన్ ప్లస్ అని పిలుస్తున్నారు.

2 వేరియంట్లలో అందుబాటులోకి!

తాజా వెర్షన్‌ కారును బీజింగ్‌ లో జరిగిన ఆటో షోలో ప్రదర్శించారు. ఈ కారులో కొత్త డిజైన్‌ తో పాటు శక్తివంతమైన మోటార్ ఆప్షన్లు, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ అందించారు. ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి సింగిల్ మోటార్ వేరియంట్. ఇది వెనుక భాగంలో అమర్చబడి ఉంటుంది. 200 Kw పవర్ ను ఇస్తుంది. దీనికి 57.5 kWh సామర్థ్యంతో కూడిన LFP బ్లేడ్ బ్యాటరీ ఉంటుంది. ఈ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 540 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

Advertisement

ఇక రెండోది మరింత పవర్ ఫుల్ వేరియంట్. ఇది 240 kW మోటార్‌తో వస్తుంది. 68.5 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ సుమారు 630 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ కారు సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

జస్ట్ 5 నిమిషాల్లో ఛార్జింగ్

ఈ కొత్త అట్టో 3లో కీలకమైన అప్ డేట్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ. కేవలం 5 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. పూర్తిగా 10 నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 9 నిమిషాలు పడుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఛార్జింగ్ వ్యవస్థలతో పోలిస్తే అత్యంత వేగవంతమైనది. ఇందుకోసం BYD కొత్త LFP బ్యాటరీలను ఉపయోగిస్తోంది. ఇవి 1,500 kW వరకు ఛార్జింగ్ స్పీడ్‌ను అందిస్తాయి. ఈ ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్లు చైనాలో వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో స్టేషన్లు పని చేస్తున్నాయి.

పెరిగిన అట్టో 3 పరిమాణం

Advertisement

కొత్త అట్టో 3 పరిమాణం కూడా పెరిగింది. ఇది సుమారు 4,665 మిల్లీమీటర్ల పొడవుతో వస్తుంది. పాత మోడల్ కంటే పెద్దది. ఇంటీరియర్ విషయంలో కూడా మార్పులు తీసుకొచ్చింది. పెద్ద 15.6 అంగుళాల టచ్ స్క్రీన్, ఆధునిక డిజైన్, క్లీనైన లేఅవుట్ ఆకట్టుకుంటాయి. సెంటర్ కన్సోల్‌లో 50W వైర్‌ లెస్ ఛార్జర్ కూడా అందించారు. గేర్ షిఫ్టర్‌ ను స్టీరింగ్ వీల్ దగ్గరకు మార్చడం వల్ల లోపలి భాగం మరింత విశాలంగా కనిపిస్తుంది. ఈ కొత్త మోడల్ ఆస్ట్రేలియా మార్కెట్‌ లో ఎప్పుడు విడుదల అవుతుందో ఇంకా ప్రకటించలేదు. భారత్ లో విడుదల అవుతుందా? లేదా? అనేది కూడా త్వరలో తెలియనుంది.

Read Also: ఎలక్ట్రిక్ To ఏఐ.. వామ్మో.. ఇవేం కార్లు భయ్యా చూస్తేనే కళ్లు చెదిరిపోతున్నాయ్!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×