E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ To ఏఐ.. వామ్మో.. ఇవేం కార్లు భయ్యా చూస్తేనే కళ్లు చెదిరిపోతున్నాయ్!

ఎలక్ట్రిక్ To ఏఐ.. వామ్మో.. ఇవేం కార్లు భయ్యా చూస్తేనే కళ్లు చెదిరిపోతున్నాయ్!
Advertisement

Beijing Auto Show 2026: ఔనన్నా.. చైనా వాడి బుర్రే బుర్ర భయ్యా. ఏ రంగంలో తీసుకున్నా, మనతో పోల్చితే మూడు దశాబ్దాల ముందు ఉన్నట్లు చెప్పక తప్పదు. ఏప్రిల్ 24న ప్రారంభమైన బీజింగ్ ఆటో షో చూస్తే, మీరూ నిజమే అనక తప్పదు. ఆ కార్లను చూసి ఆశ్చర్యపోక తప్పదు. ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ అంతా ఒకే వేదికపై దర్శనం ఇస్తోంది. ముఖ్యంగా చైనా ఈ రంగంలో ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో ఈ ప్రదర్శన ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, భవిష్యత్ కార్ల రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలే ప్రధాన ఆకర్షణ

ఈ ఆటో షోలో ప్రధాన ఆకర్షణ ఎలక్ట్రిక్ వాహనాలు. చైనా కంపెనీలు తయారు చేస్తున్న కొత్త మోడళ్లు కేవలం పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాదు, పనితీరు పరంగా కూడా అబ్బుర పరుస్తున్నారు. బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడడంతో ఒకసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం పెరిగింది. దీనివల్ల వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

కళ్లు చెదిరే ఏఐ టెక్నాలజీ వినియోగం

Advertisement

ఈ ఆటో ప్రదర్శనలో ప్రత్యేకంగా కనిపించేది ఏఐ టెక్నాలజీ వినియోగం. ఆధునిక కార్లలో ఇప్పుడు వాయిస్ కమాండ్‌ లు, ఆటోమేటిక్ డ్రైవింగ్ అసిస్టెన్స్ వ్యవస్థలు, స్మార్ట్ నావిగేషన్ లాంటి ఫీచర్లు సాధారణంగా మారుతున్నాయి. డ్రైవర్ అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని సహాయం చేసే సిస్టమ్స్ కూడా ఇక్కడ ప్రదర్శించిన కార్లలో ఉన్నాయి. ఈ మార్పులు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభంగా, సురక్షితంగా మార్చుతున్నాయి.

విలాసవంతమైన ఇంటీరియర్ డిజైన్

కార్ల ఇంటీరియర్ డిజైన్‌ కూడా అత్యద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద టచ్ స్క్రీన్లు, డిజిటల్ డిస్ప్లేలు, మినిమలిస్టిక్ డిజైన్లు ట్రెండ్‌ గా మారాయి. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా సీటింగ్, లైటింగ్, కనెక్టివిటీ ఫీచర్లను కొత్తగా రూపొందిస్తున్నారు. కొన్ని కార్లలో అయితే మొబైల్ ఆఫీస్‌ లా ఉపయోగించుకునే విధంగా కూడా ఇంటీరియర్స్ ఉన్నాయి.

ప్రపంచ ఆటో మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు

Advertisement

చైనా కంపెనీలు టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టడంతో, ప్రపంచ మార్కెట్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ధర, ఫీచర్లు, ఇన్నోవేషన్ పరంగా చైనా కంపెనీలు పోటీగా నిలుస్తున్నాయి. ఈ బీజింగ్ ఆటో షో ద్వారా స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే, భవిష్యత్ వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాకుండా స్మార్ట్ డివైస్‌ లుగా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ పవర్, ఏఐ టెక్నాలజీ, డిజిటల్ కనెక్టివిటీ కలిసి ఒక కొత్త ఆటోమోటివ్ యుగానికి నాంది పలుకుతున్నాయి. ఈ ఆటో ప్రదర్శన చైనా ఆటోమోటివ్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూపిస్తూ, ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వాహన రంగం పూర్తిగా మారిపోవడానికి ఇదో సూచనగా కనిపిస్తోంది.

Read Also: కార్లకు కొత్త తెలివి.. నోటి మాటతో చెప్పిన పని చేసేస్తాయ్!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×