E-Paper
Advertisement

సచివాలయంలో రీల్స్ చేసిన పోలీస్.. చివరకు సీన్ కట్ చేస్తే..?

సచివాలయంలో రీల్స్ చేసిన పోలీస్.. చివరకు సీన్ కట్ చేస్తే..?
Advertisement

Fake police arrested: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన సచివాలయ ప్రాంగణంలో పోలీస్ యూనిఫామ్ ధరించి రీల్స్ చేసిన ఒక యువకుడి ఉదంతం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ అనే యువకుడు నకిలీ పోలీస్ అవతారమెత్తి పోలీసులకే సవాల్ విసిరాడు. చివరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగా సైఫాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

నిందితుడు రవికి చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనే బలమైన కోరిక ఉండేది. ఆ కోరిక తీరకపోవడంతో ఏకంగా నకిలీ పోలీస్ (Pseudo Police) అవతారమెత్తి అందరినీ నమ్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీస్ యూనిఫామ్ కొనుగోలు చేసి నిఖిల్ యాదవ్ అనే పేరుతో సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించాడు. యూనిఫామ్ ధరించి వీడియోలు చేస్తూ తానే అసలైన పోలీస్ అధికారిగా ఫోజులు కొట్టేవాడు.

Advertisement

ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రవి.. పక్కా ప్రణాళికతో పోలీస్ యూనిఫామ్ ధరించి సచివాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ భద్రత విధుల్లో ఉన్న సిబ్బందిని తాను కూడా పోలీస్ అధికారినేనని నమ్మబలికాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లి కేవలం ఫోటోలు దిగుతానని వారిని బతిమిలాడాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడి మాటలు నమ్మి లోపలికి అనుమతించడంతో.. తన కుటుంబంతో కలిసి లోపలికి వెళ్లి ఫోటోలతో పాటు ఒక వీడియో రీల్ కూడా చేశాడు.

నిందితుడు రవి సచివాలయంలో చేసిన ఆ వీడియో రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తుకు ఆదేశించారు. సైఫాబాద్ పోలీసులు నిందితుడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా.. అతను కేవలం సచివాలయం వద్దే కాకుండా ఉప్పల్ స్టేడియం మరికొన్ని కీలక ప్రదేశాల్లో కూడా ఇదే తరహాలో నకిలీ పోలీస్ యూనిఫామ్‌తో రీల్స్ చేసినట్లు గుర్తించారు.

Advertisement

నిందితుడి ఆచూకీ కనుగొన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రవి అసలైన పోలీస్ కాదని కేవలం గుర్తింపు కోసం ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. నిందితుడిపై చీటింగ్ కేసుతో పాటు ఐటీ యాక్ట్ (IT Act) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సచివాలయం వంటి హై సెక్యూరిటీ జోన్లలో భద్రతా లోపాలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Read Also: తెలంగాణలో ఇంధన సరఫరా 175 శాతం పెంపు.. పానిక్ బయింగ్ వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి!

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×