E-Paper
Advertisement

Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను చాలా రోజుల నుంచి వాడట్లేరా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి!

Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను చాలా రోజుల నుంచి వాడట్లేరా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి!
Advertisement

గత కొంత కాలంగా భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది. చాలా మంది పెట్రో టూ వీలర్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. పొల్యూషన్ లేకపోవడం, తక్కువ ప్రయాణ ఖర్చు కారణంగా ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే, పెట్రో వాహనాలతో పోల్చితే, ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసే వాళ్లు ఈ విషయాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా స్కూటర్ ఛార్జింగ్ విషయంలో అవగాహన ఉండాలి. EVని ఎక్కువ కాలం  ఉపయోగించకుండా  ఉంచడం సరైందేనా? ఒకవేళ ఉంచాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ కాలం ఎలక్ట్రిక్ స్కూటర్ ను నడపకుండా ఉంచితే?

నిజానికి పెట్రో స్కూటర్లతో పోల్చితే, ఎలక్ట్రిక్ స్కూటర్ దీర్ఘకాలిక నిర్వహణలో తేడా ఉంటుంది. ఎక్కువ కాలం నడపకుండా ఉంచితే, బ్యాటరీ వోల్టేజ్ సమస్యలను ఎదుర్కొనే పెట్రోల్ స్కూటర్ల మాదిరిగా కాకుండా, ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో కాస్త భిన్నమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తాయి. ఇవి ఉపయోగంలో లేనప్పుడు నెమ్మదిగా ఛార్జింగ్ ను కోల్పోతాయి. ఒక నెల వ్యవధిలో ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా పని చేయడం మానేస్తుంది.  ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎక్కువ కాలం నడపకుండా ఉంచినప్పుడు.. బ్యాటరీ పని చేయదు. బ్యాటరీ దాని అంతర్గత విధులను నిర్వహించడానికి తక్కువ మొత్తంలో శక్తిని ఉపయోగించుకుంటుంది. ఫలితంగా బ్యాటరీ పని చేయడదు. అయితే, లేటెస్ట్ బ్యాటరీ ప్యాక్‌లు చాలా రోజుల వరకు స్కూటర్ నడపకపోయినా ఛార్జింగ్ ను పూర్తిగా కోల్పోకుండా ఉంటున్నాయి.

Advertisement

Read Also: Raptee.HV గుడ్ న్యూస్.. T30 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం!

ఎక్కువ రోజులు ఎలక్ట్రిక్ స్కూటర్ వాడకపోతే?

ఒకవేళ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చాలా కాలం పాటు వాడకుండా ఉంటే, బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కాకుండా కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

Advertisement

⦿ స్కూటర్ ఉపయోగంలో లేనప్పటికీ.. తరచుగా బ్యాటరీని ఛార్జ్ చేయాలి.

⦿ బ్యాటరీ డిశ్చార్జ్‌ కు దారితీసే తీవ్రమైన ఉష్ణోగ్రతలను నివారించడానికి స్కూటర్‌ను చల్లని, పొడి ప్రదేశంలో నిలిపి ఉంచాలి.

⦿ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వకుండా చూసుకోవాలి. లేదంటే దీర్ఘకాలిక లైఫ్ టైమ్ తగ్గుతుంది

ఈ మూడు జాగ్రత్తలు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగకరంగా ఉంటాయి. బ్యాటరీ పనితీరు, లైఫ్ టైమ్ ను పెంచుతాయి. చాలా మంది తయారీదారులు బ్యాటరీని సరైన స్థితిలో ఉంచడానికి కనీసం నెలకు ఒకసారి ఛార్జ్ చేయాలని సిఫార్సు చేస్తారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఉపయోగించకపోతే వాటికి ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదని భావిస్తారు. కానీ, బ్యాటరీని ఛార్జ్ చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పనితీరు దెబ్బతింటుంది.

Read Also: ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,000 కి.మీ ప్రయాణం, కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×