E-Paper
Advertisement

T30 Electric Bike: Raptee.HV గుడ్ న్యూస్.. T30 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం!

T30 Electric Bike: Raptee.HV గుడ్ న్యూస్.. T30 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Raptee.HV.. T30 ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్ డెలివరీలను ప్రారంభించింది. మొదటి సెట్ మోటార్ సైకిళ్ళు చెన్నైలో డెలివరీ చేయబడ్డాయి. చెన్నై Raptee.HV కి ఫస్ట్ ఆపరేషనల్ మార్కెట్. ఈ నేపథ్యంలో అక్కడ డెలివరీలు, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు ఇప్పటికే చురుగ్గా ఉన్నాయి. దాని విస్తరణ ప్రణాళికలలో భాగంగా, కంపెనీ ఏప్రిల్ 2026లో ప్రత్యేక షోరూమ్, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ తో బెంగళూరులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ కు ఇస్తరించాలని భావిస్తుంది. ఆ తర్వాత పశ్చిమ భారతంలోనూ తన కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Raptee.HV  T30 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి..

Raptee.HV.. T30 అనేది ఫస్ట్ ఇండియన్ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 5.4 kWh బ్యాటరీతో వస్తుంది. 135 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. 200 కిలో మీటర్ల రేంజ్‌ ను అందిస్తుంది. దీని ప్రత్యేకత కార్ల ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 36 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది. ధర సుమారు రూ.2.39 లక్షలు(ఎక్స్ షోరూమ్) ఉంటుంది.

Raptee.HV T30   ఫీచర్లు:

⦿ హై వోల్టేజ్ సిస్టమ్: తక్కువ వేడితో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్, ఎక్కువ కాలం మన్నికగా ఉండే బ్యాటరీతో వస్తుంది.

⦿ ఛార్జింగ్: CCS2 కారు ఛార్జింగ్ పాయింట్లకు అనుకూలంగా ఉంటుంది. అంటే కార్లు ఛార్జింగ్ చేసుకునే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లలోనూ ఈ బైక్ ను ఛార్జ్ చెయ్యొచ్చు. సాధారణ EV బైక్‌ల కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది.

⦿ పనితీరు : 135 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. ఒకే ఛార్జ్ తో ఏకంగ 200 కిలో మీటర్ల ప్రయాణం లభిస్తుంది.  5 సెకెన్లలో 0-60 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

⦿ డిజైన్, స్టైల్: ఈ బైక్ 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే, LED లైటింగ్, కీ ‌లెస్ ఇగ్నిషన్, స్పోర్టి లుక్ ను కలిగి ఉంటుంది.  ఇది 4 రంగులలో అందుబాటులో ఉంది.

⦿ సాంకేతికత: స్మార్ట్‌ వాచ్ ఇంటిగ్రేషన్ నావిగేషన్, ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ను కలిగి ఉంటుంది.

⦿ లభ్యత: ప్రస్తుతం చెన్నైలో కస్టమర్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి. బెంగళూరులో బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి.

Read Also: ఈవీ మార్కెట్ లో సత్తా చాటుతున్న స్కూటర్స్, బైక్స్ ఎందుకు వెనుకబడుతున్నాయి?

Raptee.HV T30 ధర గురించి..

Raptee.HV T30 ధర రూ. 2.39 లక్షలు ఉంటుంది. T30 ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీ, మూడు సంవత్సరాల వాహన వారంటీతో వస్తుంది. ఈ బైక్ రోజు వారీ ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. సురక్షితమైన, వేగవంతమైన ఎలక్ట్రిక్ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది.

Read Also: 2026-27లో ఏకంగా 8 కొత్త మోడల్స్, రాయల్ ఎన్‌ ఫీల్డ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×