E-Paper
Advertisement

Harish Rao: మాటల మేధావి.. కాస్త చూసుకోవాలి కదా.. చూడు ఎలా పరువు పోయిందో?

Harish Rao: మాటల మేధావి.. కాస్త చూసుకోవాలి కదా.. చూడు ఎలా పరువు పోయిందో?
Advertisement

Harish Rao: తెలుగు రాష్ట్రాల్లో బలమైన వాక్ చాతుర్యం కలిగిన అతి కొద్ది మంది నేతల్లో హరీశ్ రావు ఒకరు. తనకు ప్రతీకూలంగా ఉన్న అంశాల్లోనూ చాకచక్యంగా మాట్లాడి.. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలరన్న పేరు ఆయనకుంది. తెలంగాణలో సీఎం రేవంత్, కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో తన మాటలతో హరీశ్ రావు ప్రభావం చూపగలరు. అటువంటి హరీశ్ రావు.. చాలా రోజుల తర్వాత పప్పులో కాలేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమీషన్ సభ్యులపై అనాలోచితంగా బురద చల్లి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అజ్ఞానానికి బీజం ఎక్కడంటే?

తెలంగాణ విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, చేయాల్సిన సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళికి కమిటీ నేతృత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26న ఆయన విద్యా విధానంపై తన నివేదికను సీఎం రేవంత్ కు సైతం అందజేశారు. దీంతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు.. కమిటీలో అసలు విద్యావేత్తలే లేరంటూ వ్యాఖ్యానించారు. పాలన అనుభవం ఉన్న మాజీ ఐఏఎస్ కు విద్యార్థుల సమస్య ఏవిధంగా తెలుస్తుందని ప్రశ్నించారు. కమిటీనే సక్కగా లేనప్పుడు.. ఇక వారు ఇచ్చే రిపోర్ట్ ఏమాత్రం సక్కగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇక్కడే హరీశ్ రావు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కేసీఆర్ ను సైతం విమర్శించే అవకాశాన్ని కల్పించారని ప్రత్యర్థులు చెబుతున్నారు..

మరీ కేసీఆర్ చేసిందేంటి?

Advertisement

గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్, డీపీఆర్ ఆమోదంలో అప్పటి సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లతో పాటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ కేసీఆరే మార్చారన్న విమర్శలు సైతం ఉన్నాయి. మరి ఆయనకేం అర్హతలు ఉన్నాయని హరీశ్ రావు ప్రత్యర్థి పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నీటిపారుదల ఇంజనీరింగ్ ఆయన ఏమైనా పనిచేశారా? ఆయనకున్నవిద్యా అర్హతలేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఆయన ప్రతిపాదించిన డిజైన్ కు నీటిపారుదల, ఆర్థిక మంత్రిగా ఉండి గుడ్డిగా సపోర్ట్ చేసింది మీరు కాదా? అంటూ నిలదీస్తున్నారు.

Also Read: Kavitha Politics: నన్ను బలిపశువును చేశారు.. కవిత సంచలన వ్యాఖ్యల వెనుక అసలు టార్గెట్ ఎవరు?

హరీశ్ రావు ఆరోపణల్లో నిజమెంత?

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన విద్యా కమిటీలో అసలు విద్యావేత్తలే లేరన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కమిటీ ఛైర్మన్ ఆకునూరి మురళి తేల్చి చెప్పారు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టి.. హరీశ్ రావు అజ్ఞానాన్ని బయటపెట్టారు. విద్య గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, కమిషన్ రిపోర్టు మెుదటి పేజీ కూడా చదివి ఉండరని ఎద్దేవా చేశారు. తమను అడిగితే సీవీలు ఇచ్చేవాళ్లం కదా అంటూ సెటైర్లు వేశారు. మా ఆఫీస్ టీం లోనే 6 PhD లు, ఒక NIT, ఒక IRMA, ఒక London school of Economicsలు ఉన్నారన్నారు. 22 మంది ప్రొఫెసర్లు (అందరూ educationists లే, టీచింగ్ అనుభవం ఉన్న వాళ్ళే ) డైరెక్ట్ గా వర్కింగ్ గ్రూప్స్ ద్వారా పాల్గొన్నారని చెప్పారు. ఆకునూరి మురళి ఒక్కరే రిపోర్టు రాయరు కదా ఆ మాత్రం తెలియదా మీకు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో హరీశ్ రావు తన అవగాహన లేని మాటలతో పరువు మెుత్తం పోగొట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ పై కేస్ ఫైల్.. లైంగిక వేధింపుల కేసులో!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×