E-Paper
Advertisement

Car Safety Tips: కారులో ఈ వస్తువులు పెట్టి వదిలేస్తున్నారా? రిస్క్ చేస్తున్నారు భయ్యా!

Car Safety Tips: కారులో ఈ వస్తువులు పెట్టి వదిలేస్తున్నారా? రిస్క్ చేస్తున్నారు భయ్యా!
Advertisement

కార్లు సేఫ్ గా ఉండాలంటే వాహనదారులు కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. పార్క్ చేసిన కారులో, ముఖ్యంగా వాతావరణం వేడిగా ఉన్న సమయంలో అస్సలు వదిలేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఎందుకంటే, కారును ఎండలో పార్క్ చేసినప్పుడు, లోపల ఉష్ణోగ్రత చాలా త్వరగా పెరుగుతుంది. కేవలం 10 నిమిషాల్లో 20°C కంటే ఎక్కువ పెరిగి ప్రమాదకరంగా మారవచ్చు. ఈ సమయంలో కొన్ని వస్తువులను లోపల ఉంచితే, అవి పేలిపోవచ్చు. మంటలు అంటుకోవచ్చు. ఇంతకీ ఆ వస్తువులు ఏవంటే..

⦿ ఏరోసోల్ బాటిల్స్

హెయిర్ స్ప్రే, డియోడరెంట్, పెయింట్ స్ప్రే, ఎయిర్ ఫ్రెషనర్లు లాంటివి వేడి వాతావరణంలో పార్క్ చేసిన కార్లలలో ఉంచకూడదు. వేడి ఈ బాటిళ్లలో ఒత్తిడిని పెంచుతుంది. ఒక్కోసారి ఇవి పేలిపోవచ్చు. కారులో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కారులో ఎవరైనా ఉంటే, తీవ్ర ప్రమాదానికి గురయ్యూ అవకాశం ఉంటుంది. అందుకే, వీటిని అస్సలు కారులో ఉంచకూడదు.

⦿ లైటర్లు

Advertisement

కారులో సిగరెట్ లైటర్లు, గ్యాస్ లైటర్లను కూడా ఉంచకూడదు. ఇవి కూడా చాలా సులభంగా వేడెక్కి పేలిపోవచ్చు.  మంటలకు కారణం కావచ్చు. చిన్న లైటర్ కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే, వీటిని కారులో ఉంచకూడదు.

⦿ బ్యాటరీలు, పవర్ బ్యాంకులు

ఎక్కువ వేడి వల్ల ఇవి ఉబ్బుతాయి. లీక్ అవుతాయి. వేడెక్కుతాయి. ఒక్కోసారి పేలిపోతాయి. లిథియం బ్యాటరీలు మరింత  ప్రమాదకరమైనవి. మంటలకు కారణం అవుతాయి. వాటిని కూడా కారులో ఉంచకూడదు.

⦿ ఎలక్ట్రానిక్ పరికరాలు

Advertisement

ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు, ఛార్జర్‌లు కూడా కారులో ఉంచకూడదు. బ్యాటరీ వేడెక్కి దెబ్బతినే అవకాశం ఉంటుంది. స్క్రీన్‌లు, ప్లాస్టిక్ పార్ట్స్ వార్ప్ కావచ్చు. కరిగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయా ఎలక్ట్రిక్ పరికరాలు మంటలకు కారణం అవుతాయి.

⦿ మెడిసిన్స్

మాత్రలు, సిరప్‌లు, ఇన్సులిన్ లాంటివి కారులో ఉంచకూడదు. వేడి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. కొన్నిసార్లు వాటిని హానికరంగా మారుస్తుంది. కొన్ని మందులు చెడిపోతాయి కూడా. అధిక ఉష్ణోగ్రతలకు గురైనట్లయితే పనికి రానివిగా మారుతాయి. ప్రమాదకరంగా తయారవుతాయి.

⦿ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు  

ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు,  సోడా, బీర్, ఎనర్జీ డ్రింక్స్ లాంటి బాటిళ్లు వేడిగా ఉన్నప్పుడు వాటర్ లోకి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. బాటిళ్లలో ఒత్తిడిని పెంచుతాయి. కొన్నిసార్లు పగిలిపోతాయి.

⦿ కళ్లద్దాలు, సన్ గ్లాసెస్

ఫ్రేమ్‌లు, ముఖ్యంగా ప్లాస్టిక్, మెటల్ వేడి కారణంగా వంగిపోవచ్చు. వాటి ఆకారాన్ని కోల్పోవచ్చు. లెన్స్‌ లు కూడా దెబ్బతినవచ్చు.

⦿ ఫుడ్ ఐటెమ్స్

కారులో చాక్లెట్, చీజ్, మాంసం, గుడ్లు, వెన్న లాంటివి ఉంచకూడదు. అవి కరుగుతాయి. చెడిపోతాయి. దుర్వాసన వస్తుంది. ఆ ఫుడ్ తినడానికి సేఫ్ కాదు.

కారు సేఫ్ గా ఉండటానికి టిప్స్   

⦿ కారును లాక్ చేసే ముందు  చెక్ చేయాలి. ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లాలి.

⦿ వీలైనంత వరకు నీడలో పార్క్ చేయాలి. లేదంటే విండ్‌షీల్డ్ సన్‌షేడ్‌ను ఉపయోగించాలి.

Read Also: రూ.10 లక్షల లోపు 5 బెస్ట్ సేఫెస్ట్ కార్లు ఇవే.. టాప్‌లో ఉన్నది ఏ కారంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×