E-Paper
Advertisement

CBS vs ABS: సీబీఎస్ vs ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

CBS vs ABS: సీబీఎస్ vs ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Best Braking System for Bikes: బైక్ సేఫ్టీకి సంబంధించి బ్రేకింగ్ సిస్టమ్ చాలా ముఖ్యమైనది. ప్రమాదాలను నివారించడం, వెహికల్ మీద కంట్రోల్ కోసం ఈ సిస్టమ్‌ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం బ్రేకింగ్ కు సంబంధించి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వాటిలో ఎక్కువగా వినిపించే రెండు టెక్నాలజీలు. ఒకటి కాంబి బ్రేకింగ్ సిస్టమ్(CBS), మరొకటి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS). ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కాంబి బ్రేకింగ్ సిస్టమ్(CBS) గురించి..

కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక బ్రేక్ వేస్తే, ముందు, వెనుక వీల్స్ కు ఆటో మేటిక్ గా పవర్ వెళ్తుంది. ఒకేసారి రెండు చక్రాలు ఆగిపోతాయి. ఇది సాధారణంగా ఎంట్రీ లెవల్ బైక్‌లు, స్కూటర్లలో ఉంటుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. CBS లాభం ఏంటంటే.. తక్కువ ధర ఉంటుంది. ఈ సిస్టమ్ ఉండటం వల్ల బైక్ ధర ఎక్కువగా పెరగదు. అలాగే, ఇది బ్రేకింగ్ టైమ్ లో వాహనాన్ని అక్కడిక్కడే నిలిపి వేస్తుంది. ముఖ్యంగా నగరాల్లో నెమ్మదిగా ప్రయాణించే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అయితే, తడి రోడ్లు,  అత్యవసర పరిస్థితుల్లో CBS పనితీరు అంత కచ్చితంగా ఉండదు. ఎక్కువ స్పీడ్ లో బ్రేక్ వేయాల్సినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) గురించి..

Advertisement

ఇక యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) విషయానికి వస్తే, ఇది అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నది. రైడర్ఎమర్జెన్సీగా బ్రేక్ వేస్తే, వీల్స్ లాక్ అవకుండా అడ్డుకుంటుంది. దీంతో వెహికల్ స్లిప్ కాకుండా కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ABS ఉన్న బైక్‌ లలో, బ్రేక్ వేస్తూనే వాహనాన్ని తిప్పుకోవచ్చు. అంటే, ముందున్న ఇబ్బందులను తప్పించుకోవడం ఈజీ అవుతుంది. తడి రోడ్లు, ఇసుక రోడ్లు, కొండ ప్రాంతాల్లో కూడా ABS మంచి పనితీరు చూపిస్తుంది. అందుకే, ఇది స్పోర్ట్స్ బైక్‌లు, ఎక్కువ వేగంతో ప్రయాణించే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.

 ABSకు పెరుగుతున్న ఆదరణ

దేశంలో భద్రతను దృష్టిలో పెట్టుకుని ABSకు ఇంపార్టెన్సీ పెరుగుతుంది. ప్రస్తుతం 125cc కంటే ఎక్కువ బైక్‌ లకు ABS తప్పనిసరిగా ఉంటుంది. మున్ముందు అన్ని టూవీలర్స్ కు ఇది తప్పనిసరికానుంది. అయితే, ABS ఉన్న బైక్‌ లు కొంచెం కాస్ట్ లీగా ఉంటాయి. ఈ సిస్టమ్ కాస్త క్రిటికల్ గా ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది.

ఏది ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

Advertisement

ఎక్కువగా సిటీలో ప్రయాణించే వాళ్లు, బడ్జెట్‌  లో కొనుగోలు చేయాలనుకునే వాళ్లు CBSను తీసుకోవడం మంచిది. ఎక్కువ హైవే ప్రయాణాలు, ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే, కఠినమైన రోడ్లపై డ్రైవ్ చేస్తే ABS తీసుకోవడం మంచిది.

Read Also: ఈ కారుకు పెట్రోల్, ఛార్జింగ్ అసవసరం లేదు, హ్యాపీగా వెళ్లొచ్చు!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×