POCSO Case: స్వేచ్ఛ బ్యూరో: ఓ మైనర్ బాలుడు పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల అలంపూరు పట్టణంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి మూడవ వార్డు కౌన్సిలర్ అసిఫుద్దీన్ ఖాన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదయింది. లైంగిక కోరికలు తీర్చాలంటూ మైనర్ బాలుడును వాహనంలో బంధించి తీసుకెళ్లడం సంచలనంగా మారింది.
Also Read: అరుదైన గౌరవం అందుకున్న రోజా కూతురు.. ప్రముఖుల లిస్టులో చేరిక!
అసహజ లైంగిక వేధింపులకు పాల్పడడమే కాక బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ.. కౌన్సిలర్ అసిఫుద్దీన్ ఖాన్‌పై ఫిర్యాదు చేయడంతో అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కౌన్సిలర్ అసిఫుద్దీన్ ఖాన్ గత రెండు సంవత్సరాల నుండి వేధిస్తున్నారంటూ మైనర్ బాలుడిని వేధిస్తూ రాకపోతే నిన్ను చంపేస్తామంటూ బెదిరించడంతో.. తల్లిదండ్రులతో కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
Also Read: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?