E-Paper
Advertisement

ఈ కారుకు పెట్రోల్, ఛార్జింగ్ అసవసరం లేదు, హ్యాపీగా వెళ్లొచ్చు!

ఈ కారుకు పెట్రోల్, ఛార్జింగ్ అసవసరం లేదు, హ్యాపీగా వెళ్లొచ్చు!
Advertisement

టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సరికొత్త కార్లు మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. చాలా మంది పెట్రో కార్లను వదిలి ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లుతున్నారు. త్వరలో పవర్ అవసరం లేకుండా నడిచే కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. పెట్రోల్, విద్యుత్ అవసరం లేకుండా కారు ఎలా నడుస్తుంది? అనే ఆశ్చర్యపోకండి. ఇందుకోసం ప్రముఖ ఆటో మోబైల్ దిగ్గజం కొత్త ప్రయోగాలు చేస్తోంది.

సోలార్ పవర్ తో నడిచే కారు తయారీ

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ సోలార్ పవర్ తో నడిచే చిన్న ఎలక్ట్రిక్ కారును డెవలప్ చేస్తోంది. నిస్సాన్ సకురా మోడల్ ఆధారంగా ఆధారంగా రూపొందిస్తున్న ఈ కొత్త ప్రోటో టైప్, రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు.

Ao-సోలార్ ఎక్స్‌ టెండర్ అనే ప్రత్యేక సిస్టమ్

Advertisement

ఈ ప్రాజెక్ట్‌ లో అత్యంత కీలకమైనది Ao-సోలార్ ఎక్స్‌ టెండర్ సిస్టమ్. ఇది కారు పైకప్పు మీద అమర్చుతారు. దీనికి సోలార్ ప్యానెల్‌ ఉంటుంది. కారు పార్క్ చేసినప్పుడు, ఈ ప్యానెల్‌ ను విండ్‌ షీల్డ్ మీదకు విస్తరించే అవకాశం ఉంటుంది. దీని వల్ల సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి, విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ విద్యుత్ బ్యారీలో సేవ్ అవుతుంది. ఈ సిస్టమ్ ద్వారా సంవత్సరానికి సుమారు 3,000 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్‌ కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది.

తక్కువ దూరాలు ప్రయాణించే వారికి లాభం

ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ దూరాలు ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ పనులు, షాపింగ్, ఆఫీస్ ప్రయాణాల కోసం కారును ఎక్కువగా ఉపయోగించే వారు, తరచుగా ఛార్జింగ్ అవసరం లేకుండానే ప్రయాణించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గ్రిడ్ ఆధారిత ఛార్జింగ్‌ ను అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నాలజీ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉపయోగించే చిన్న ఎలక్ట్రిక్ కార్ల కోసం రూపొందించబడింది. ప్రత్యేకంగా  కీ కార్ సెగ్మెంట్‌ లో  చిన్న పరిమాణం, తక్కువ ఖర్చుతో ఉండే కార్లలో ఇది పెద్ద మార్పును గేమ్ ఛేంజర్ కానుంది. వినియోగదారులు తక్కువ ఖర్చుతో, తక్కువ మెయింటెనెన్స్ తో, సులభంగా నడిపే అవకాశం ఈ కారు అందిస్తుంది.

సోలార్ ప్రాజెక్టులపై పని చేస్తున్న నిస్సాన్

Advertisement

నిస్సాన్ ఇతర సోలార్ ప్రాజెక్టులపై కూడా పనిచేస్తోంది. నిస్సాన్ అరియా కాన్సెప్ట్ వెహికల్ లో హుడ్, రూఫ్,  వెనుక భాగంలో అధిక సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ ను అమర్చారు. దీని ద్వారా వాహనాన్ని తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని 35% నుంచి 55% వరకు తగ్గిస్తుంది. ఇది భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత సులభతరం చేయనుంది.

ఈ ప్రోటోటైప్‌ ను జపాన్ మొబిలిటీ షోలో నిస్సాన్ కంపెనీ ప్రదర్శించింది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సౌరశక్తి ఆధారిత కార్ టెక్నాలజీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మరింత అనుకూలంగా మారబోతోంది.

Read Also: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.11 వేల సబ్సిడీతో ఈ-సైకిళ్లు, ఎలా పొందాలంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×