E-Paper
Advertisement

EV Scooter Charging in Summer: సమ్మర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్.. ఎంతసేపు చేస్తే మంచిది?

EV Scooter Charging in Summer: సమ్మర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్.. ఎంతసేపు చేస్తే మంచిది?
Advertisement

దేశ వ్యాప్తంగా ఎండలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే ఇంచుమించు 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మేలో ఎండల గురించి ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉండబోతున్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు నడిపే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ సమ్మర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎంతసేపు ఛార్జింగ్ పెడితే మంచిది? పరిమిత సమయం దాటే వరకు ఉంచితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సమ్మర్ బ్యాటరీ వేడి సమస్యలు

ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సాధారణంగా 3 నుండి 8 గంటలు పడుతుంది. చాలా మోడళ్లకు సగటున 4–5 గంటలు పడుతుంది. సమ్మర్ వేడి కొన్నిసార్లు ఛార్జింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది.  అయితే, బ్యాటరీని చాలా వేడిగా మారుస్తుంది. ఫలితంగా బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్(BMS) ఇబ్బందులు కలకుండా ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తుంది.

Advertisement

వేసవిలో ఛార్జింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

⦿ సరైన ఛార్జింగ్ టైమింగ్స్: వేడెక్కకుండా ఉండటానికి రాత్రి పూట లేదంటే తెల్లవారుజామున.. అంటే చల్లని సమయాల్లో ఛార్జ్ చేయడం మంచిది.

Advertisement

⦿ వెంటనే ఛార్జింగ్ చేయవద్దు: స్కూటర్ నడిపిన వెంటనే ఛార్జింగ్ చేయకూడదు. ఎందుకంటే, ప్రయాణం కారణంగా బ్యాటరీ అప్పటికే వేడిగా ఉంటుంది. అందుకే, నీడలో కనీసం గంటసేపు కూల్ అయ్యాక ఛార్జింగ్ పెట్టడం మంచిది.

⦿ ఛార్జింగ్ ఎంత వరకు చేయాలి?: తీవ్రమైన వేడిలో, బ్యాటరీపై వేడి తీవ్రతను తగ్గించేందుకు 100 శాతం ఛార్జింగ్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సుమారు 70-80% మధ్య ఉంచడం మంచిదంటున్నారు.

⦿ ఒరిజినల్ ఛార్జన్ ను వాడండి: వేడెక్కడం, బ్యాటరీ దెబ్బతినడం లాంటి సమస్యల నుంచి బయటపడేందుకు  తయారీదారు అందించిన ఒరిజినల్ ఛార్జర్‌ ను ఉపయోగించాలి.

⦿ ఎక్కడ ఉంచి ఛార్జింగ్ చేయాలి? బ్యాటరీ ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి నీడ, బాగా వెంటిలేషన్, పొడిగా ఉన్న ప్రదేశంలో స్కూటర్ ను ఉంచి ఛార్జ్ చేయడం మంచిది.

Read Also:  టీవీఎస్ ఐక్యూబ్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఎలక్ట్రిక్ స్కూటర్ల ఛార్జింగ్ గురించి..

ఫాస్ట్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ చేయడం వల్ల 1.5–3 గంటల్లో 100 శాతం ఛార్జింగ్ అవుతుంది. స్టాండర్డ్ లిథియం-అయాన్ ఛార్జర్ ద్వారా 4–5 గంటలు పడుతుంది. చిన్న, బడ్జెట్ స్కూటర్లు 6–8 గంటల సమయం తీసుకుంటాయి. మొత్తంగా సమ్మర్ లో ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయడం వల్ల బ్యాటరీ సేఫ్ గా ఉంటుంది. వెహికల్ కూడా స్మూత్ గా వెళ్తుంది. ఏమాత్రం పొరపాట్లు చేసిన బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

Read Also: టయోటా To టాటా.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్ ఈవీ కార్లు ఇవే!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×