Top Trending EV Cars March 2026:గత కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ కార్ల మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ కార్లు పెద్ద సంఖ్యలో విడుదల అయ్యాయి. మంచి లుక్, అంతకు మించి రేంజ్ తో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా పలు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అయ్యాయి. అయితే, మార్చి 2026లో టాప్ ట్రెండింగ్ ఈవీ కార్ల గురించి తెలుసుకుందాం. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ SUVలు, కాంపాక్ట్ మోడళ్లు ఉన్నాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, స్కోడా ఎల్రోక్, టాటా సియెర్రా EV ఈ నెలలోఏ లాంచ్ కాబోతున్నాయి. మారుతి ఇ-విటారా, కియా సైరోస్ EV, మెర్సిడెస్-బెంజ్ CLA ఎలక్ట్రిక్ కార్లు త్వరలో లాంచ్ కాబోతున్నాయి.
⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా: మార్చి 2026 మధ్యలో ఈ కారు లాంచ్ కానుంది. ఒకే ఛార్జ్ తో 440 కి.మీ నుంచి 543 కి.మీ రేంజ్ ను అందించనున్నాయి.
⦿ స్కోడా ఎల్రోక్: మార్చి 16న ఈ కారు లాంచ్ కానుంది. ఈ కారు కూడా మంచి రేంజ్ ను అందించనుంది. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVగా విడుదల కానుంది.
⦿ టాటా సియెర్రా EV: ఈ కారు 55-65 kWh బ్యాటరీ ప్యాక్స్ తో రానుంది. ప్రీమియం, మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. 2026 ఫస్ట్ క్వార్టర్ లో విడుదల అవుతుందని భావిస్తున్నారు.
⦿ కియా సైరోస్ EV: ఇది కాంపాక్ట్ SUVగా మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. మార్చి 2026లో లాంచ్ అవుతుంది. టాటా నెక్సాన్ EVకి పోటీగా పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించబడింది.
⦿ మారుతి సుజుకి ఇ-విటారా: ఎక్కువ రేంజ్ అందించేలా ఈ కారును రూపొందించారు. మాస్ మార్కెట్ SUV విభాగంలో మెయిన్ ప్లేయర్ గా ఉండబోతోంది.
⦿ మెర్సిడెస్-బెంజ్ CLA ఎలక్ట్రిక్: ఈ కారు కూడా 2026 ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ కానుంది. 792 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. 85.5 kWh బ్యాటరీతో వస్తుంది. ప్రీమియం, లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ సెడాన్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.
Read Also: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
⦿ మహీంద్రా XEV 9e: ఈ కారు కూడా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ను అందించనుంది. లేటెస్ట్ ఫీచర్లతో కూడిన కీలకమైన SUVగా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది.
⦿ టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్: ఈ కారు కూడా 2026లోనే అందుబాటులోకి వస్తుంది. సరసమైన కాంపాక్ట్ SUVగా మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోనుంది.
⦿ BMW iX3: లగ్జరీ కార్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, విలాసవంతమైన, వేగవంతమైన ఛార్జింగ్ క్రాస్ ఓవర్ కలిగిన కారుగు మార్కెట్ లోకి రానుంది. ఒకే ఛార్జ్ తో 800 కి.మీ పరిధిని అందిస్తుందని భావిస్తున్నారు.
Read Also: ఓలా To టీవీఎస్.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్ ev స్కూటర్లు ఇవే!