E-Paper
Advertisement

Daily Commute Cheapest Cars: మారుతి సుజుకి ఆల్టో To రెనాల్ట్ క్విడ్.. రోజువారీ అవసరాలకు బెస్ట్ కార్లు!

Daily Commute Cheapest Cars: మారుతి సుజుకి ఆల్టో To రెనాల్ట్ క్విడ్.. రోజువారీ అవసరాలకు బెస్ట్ కార్లు!
Advertisement

తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ తో రోజు వారీ ప్రయాణాలకు అనులకూలంగా ఉండే కార్ల కోసం చాలా మంది వెతుకుతుంటారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో పలు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఉన్నాయి. అంతేకాదు, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాయి. అత్యుత్తమ మైలేజీతో అత్యంత సరసమైన రోజువారీ ప్రయాణ కార్లు ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ బడ్జెట్ కార్లు  

Advertisement

⦿ మారుతి సుజుకి ఆల్టో K10: ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన కారు ఇదే. కేవలం రూ. 3.7 – రూ.5.45 లక్షల్లో లభిస్తుంది. లీటర్ పెట్రోల్ తో ఏకంగా 24.39 కిమీ మైలేజ్ ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది పట్టణ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

⦿ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: ఆటో మార్కెట్ లో అందుబాటులో ఉన్న చీప్ అండ్ బెస్ట్ కార్లలో ఇది కూడా ఒకటి. దీని ధర రూ. 4.15 లక్షల నుంచి రూ. 6.12 లక్షల వరకు ఉంటుంది. మంచి సీటింగ్ ప్లేస్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు 21 కిమీ మైలేజ్ తో ఆకట్టుకుంటుంది. పెట్రోల్, CNG  ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Advertisement

⦿ రెనాల్ట్ క్విడ్: ఈ కారు ధర రూ. 4.23 నుంచి రూ.5.99 లక్షలు ఉంటుంది. మంచి క్యాబిన్ స్థలం, ఇంధన సామర్థ్యంతో స్టైలిష్, SUV ప్రేరేపిత డిజైన్‌ ను కలిగి ఉంటుంది.

⦿ మారుతి సుజుకి సెలెరియో: ఈ కారు ధర రూ. 4.7 నుంచి రూ. 6.73 లక్షలు ఉంటుంది. కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా,  26.68 కిమీ మైలేజ్ ఇస్తుంది. మంచి ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

⦿ టాటా టియాగో: ఈ కారు ధర రూ. 4.57 లక్షల నుంచి రూ. 7.82 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు భద్రత పరంగా 4 స్టార్ GNCAP రేటింగ్ ను కలిగి ఉంటుంది. మంచి మైలేజీని అందిస్తుంది. బడ్జెట్ విభాగంలో బిల్డ్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి  అనుకూలంగా ఉంటుంది.

Read Also:  టాటా సియెర్రా To మారుతి సుజుకి ఇ విటారా.. త్వరలో లాంచ్ కాబోతున్న క్రేజీ ఈవీలు!

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం

⦿ మైలేజ్: మారుతి మోడల్స్  ఆల్టో, ఎస్ ప్రెస్సో, సెలెరియో సాధారణంగామంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. 22 నుంచి 25 కి.మీ వరకు మైలేజ్ అందిస్తాయి.

⦿ CNG ఎంపిక:  మంచి పొదుపు కోసం S-ప్రెస్సో, ఆల్టో K10 CNG వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులను అందిస్తున్నాయి.

⦿ ట్రాన్స్ మిషన్: ఆల్టో K10, క్విడ్, ఎస్ ప్రెస్సో ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.  ఇవి సిటీ ట్రాఫిక్ డ్రైవింగ్‌ ను మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. తక్కువ సర్వీస్, మెయింటెనెన్స్ ఖర్చులను అందిస్తాయి.

Read Also: మరింత కొత్తగా మార్కెట్ లోకి మారుతి సుజుకి బ్రెజ్జా, కీ ఛేంజెస్ ఇవే!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×