E-Paper
Advertisement

Mystery web Series : చిన్న వయసులోనే మిస్సింగ్…12 ఏళ్ల తర్వాత ఇంటికి… ఫ్యూజులు అవుట్ అయ్యే సస్పెన్స్

Mystery web Series : చిన్న వయసులోనే మిస్సింగ్…12 ఏళ్ల తర్వాత ఇంటికి… ఫ్యూజులు అవుట్ అయ్యే సస్పెన్స్
Advertisement

Mystery web Series: ఓటీటీలో ఇప్పడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కొరియన్ సిరీస్ లు ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ లను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. చిన్నప్పుడు మిస్ అయిన కొడుకు పెద్ద అయ్యాక తిరిగి ఇంటికి వస్తాడు. ఆ తరువాత వచ్చే స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతూ సాగుతుంది. కొరియన్ ఫ్యాన్స్ తప్పక చూడాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ కొరియా మిస్టరీ మెలోడ్రామా సిరీస్ పేరు ‘డియర్ హాంగ్‌రాంగ్’ (Dear Hongrang). కిమ్ హాంగ్-సన్ దర్శకత్వంలో లీ జే-వూక్, జో బో-ఆహ్ ఇందులో నటించారు. ‘టాంజియం: స్వాలోయింగ్ గోల్డ్’ ఆధారంగా రూపొందింది. ఇది 2025 మే 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ‘టాంజియమ్’ (Tangeum) అనే ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొత్తం 11 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన విజువల్స్‌ తో ఆకట్టుకుంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జోసోన్ కాలంలో ఒక పెద్ద బిజినెస్ కుటుంబానికి వారసుడైన హోంగ్‌రాంగ్ అనే చిన్నబ్బాయి ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు. అతన్ని వెతకడానికి ఆ కుటుంబం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత, ఒక యువకుడు తాను హోంగ్‌రాంగ్‌నని చెబుతూ తిరిగి వస్తాడు. అతని రాకతో ఆ ఇంట్లో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. అతని తల్లి తన కొడుకు తిరిగి వచ్చాడని సంతోషపడుతుంది కానీ, అతని సోదరి జే-యికి మాత్రం అతను తన తమ్ముడేనా అని అనుమానం కలుగుతుంది.

జే-యి తన తమ్ముడి అసలు రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఆ యువకుడు మాత్రం ఏదో ఒక పెద్ద ప్లాన్‌తోనే ఇంట్లోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తుంటాడు. ఈ క్రమంలో ఆ కుటుంబంలో దాగి ఉన్న సెక్రెట్స్, ఆస్తి కోసం జరిగే కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఒక పక్క వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం, మరోపక్క ప్రాణాలకే ముప్పు తెచ్చే మిస్టరీతో ఈ కథ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరికి అతను నిజమైన వారసుడా ? లేక ఒక తెలివైన మోసగాడా ? అనేది తెలుసుకోవాలంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also : 16 ఏళ్లకే క్యాన్సర్… చావులోనూ చచ్చేంత ప్రేమ… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×