E-Paper
Advertisement

Mercedes Baby G-Class: లాంచ్ కు రెడీ అవుతున్న మెర్సిడెస్ బేబీ జి-క్లాస్, మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడంటే?

Mercedes Baby G-Class: లాంచ్ కు రెడీ అవుతున్న మెర్సిడెస్ బేబీ జి-క్లాస్, మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

Mercedes Baby G-Class Car: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరో క్రేజీ కారును మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. బేబీ జి-క్లాస్‌ పేరుతో ఈ కారు వినియోగదారులకు పరిచయం చేయబోతోంది. ఇప్పటికే బెంజ్ కంపెనీ చిన్న జి-క్లాస్ కారు డెవలప్ మెంట్ గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ కూడా జరపుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో ఈ కారు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. మెర్సిడెస్ బెంజ్ బేబీ జి-క్లాస్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మెర్సిడెస్ బేబీ జి-క్లాస్ రెండరింగ్  

స్పై షాట్ల ఆధారంగా, మెర్సిడెస్ బేబీ జి-క్లాస్  రెండరింగ్స్ ను చూసే అవకాశం ఉంది. ఈ రెండర్లు ఐకానిక్ మెర్సిడెస్ జి-క్లాస్  రాబోయే చిన్న వెర్షన్ ఎలా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. కంపెనీ ఇంకా ఈ SUV పేరును వెల్లడించలేదు. కానీ దీనిని  బేబీ జి అని పిలుస్తోంది. డిజైన్ విషయానికొస్తే.. మెర్సిడెస్ బేబీ జి G-క్లాస్ చిన్న వెర్షన్ లాగా కనిపిస్తుంది. ఇది చాలా ఖరీదైనది. వెనుక టెయిల్‌ గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ కూడా అలాగే ఉంటుంది. ఫాసియా దాదాపు వృత్తాకార LED DRLని మూడు కోణాల నక్షత్రంతో కూడిన ప్రముఖ గ్రిల్‌ తో చూపిస్తుంది.

Advertisement

బంపర్లు ఎయిర్ ఇన్‌టేక్‌ లను కలిగి ఉంటాయి. బంపర్ల కింద రియల్ బాష్ ప్లేట్ ఉంటుందని తెలుస్తోంది. స్పై షాట్లు అంతర్గతంగా అమర్చబడిన డోర్ హింజ్‌ లను కన్ఫార్మ్ చేశాయి. వీటిని రెండర్లలో కూడా చూడవచ్చు. G-క్లాస్‌తో వచ్చే ఫెండర్ మౌంటెడ్ టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి. మెర్సిడెస్ బేబీ జి-క్లాస్ రెండర్లలో ఇతర కీలక అంశాలను పరిశీలిస్తే,  నిటారుగా ఉండే విండ్‌ స్క్రీన్, క్లామ్‌ షెల్ బోనెట్, ఫ్లేర్డ్ ఫెండర్లతో కూడిన భారీ వీల్ ఆర్చ్‌ లు, నలుపు రంగులో పెద్ద అల్లాయ్ వీల్స్, సొగసైన రూఫ్ రైల్స్ ఉన్నాయి. ఈ రెండర్ పొడవు 4.5 మీటర్ల కంటే తక్కువ ఉంటుంది. 2.7 మీటర్ల నుంచి 2.8 మీటర్ల పొడవు గల వీల్‌ బేస్ ఉండవచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

బేబీ జి-క్లాస్ నుంచి ఏం అంశించవచ్చు అంటే?

బేబీ జిపై పవర్‌ ట్రెయిన్ వివరాలను మెర్సిడెస్ బెంజ్ ఇంకా నిర్ధారించలేదు. కంపెనీ పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ రెండర్ బ్లూ షేడ్‌ లో EQ టెక్నాలజీతో జి-క్లాస్ ఎలక్ట్రిక్ G 580లో కనిపించే సౌత్ సీస్ బ్లూ మాగ్నో కలర్ నుంచి పొందింది.

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న నేపథ్యంలో మెర్సిడెస్ బేబీ జిని ICE పవర్‌ ట్రెయిన్‌ లతో తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌లను కూడా కొట్టిపారేసే అవకాశం లేదు. త్వరలోనే ఈ అంశంపై బెంజ్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: కొత్త బ్యాటరీ, సరికొత్త రేంజ్.. సరికొత్త టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×