ప్రజల్లో పొల్యూషన్ లేని ప్రయాణం పట్ల అవగాహన పెరుగుతోంది. అందులో భాగంగానే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ విస్తరిస్తోంది. రోజు రోజుకు ఆటో మోబైల్ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలో, ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్లను పరిచయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో జరిగిన తాజా పరిశోధన ఆసక్తి కలిగిస్తోంది. అదే సమయంలో కొన్ని విమర్శలకు గురయ్యింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
2025 సెప్టెంబర్లో చైనాలో EV బ్యాటరీ ఎజెక్షన్ సిస్టమ్ను పరీక్షించారు. చైనా ఆటోమోటివ్ కొలిషన్ రిపేర్ & టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ కొనసాగింది. ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. కారులో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడినప్పడు ఆటో మేటిక్ గా బ్యాటరీ బ్యాక్ కారు నుంచి బయటకు ఎజెక్ట్ అవుతుంది. బ్యాటరీలో అతిగా వేడెక్కి మంటలు వచ్చిన సమయంలో, బ్యాటరీ కారు నుంచి బయటికి రాకెట్ లాగా ఎజెక్ట్ అవుతుంది. కారులో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అందులోని ప్రయాణీకులు అంతా సేఫ్ గా ఉంటారు.
ఎలక్ట్రిక్ కారులో సెన్సార్లు బ్యాటరీలో సమస్య గారానే ముందుగా గుర్తిస్తాయి. ఎయిర్ బ్యాగ్ లాంటి గ్యాస్ జనరేటర్ ఉపయోగించి బ్యాటరీని 1 సెకను లోపు బయటికి నెట్టేస్తుంది. బ్యాటరీ ప్యాక్ 3 నుంచి 6 మీటర్లు దూరంలో పడిపోతుంది. ఇలా చేయడం వల్ల కారులోని ప్రయాణికులకు అగ్ని ప్రమాద ముప్పు నుంచి సేఫ్ గా బయటపడతారు. టెస్ట్ సందర్భంగా SUV బ్యాటరీ సైడ్ నుంచి బయటికి అత్యంత వేగంగా ఎజెక్ట్ అయ్యింది. ఆ తర్వాత స్మోక్ వచ్చి సేఫ్టీ టీమ్ ఫైర్ బ్లాంకెట్ తో కవర్ చేసింది. ఈ పరీక్షను చైనా ఆటోమోటివ్ కొలిషన్ రిపేర్ & టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిర్వహించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు వెల్లడించింది. అయితే, ఇప్పటి వరకు ఏ కారులోనూ ఈ టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు.
China is testing EV's that can EJECT their batteries in emergency situations.
Good idea or overkill? 🤔 pic.twitter.com/HqdMVy2c3N
— HOW THINGS WORK (@HowThingsWork_) January 9, 2026
టెస్టింగ్ కంపెనీ ఇది అత్యంత సేఫ్ విధానం అని చెప్పినా, చాలా మంది అత్యంత ప్రమాదకరమైన సేఫ్టీ సిస్టమ్ అంటున్నారు. ప్రమాదకర పరిస్థితుల సమయంలో సుమారు 2 నుంచి 5 క్వింటాళ్ల బరువు ఉండే బ్యాటరీ మండుతూ బయటకు ఎజెక్ట్ అయితే, రోడ్డు మీద వెళ్లే ఇతర వాహనాలకు, నడిచి వెళ్లే వ్యక్తులకు, పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులకు కారణం అవుతుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్ లో కారు డ్యమేజ్ అయితే ఎజెక్షన్ మెకానిజం పనిచేయకపోవచ్చంటున్నారు. ఈ టెక్నాలజీ సమస్యను కారు నుంచి బయటకు పంపిస్తుందే తప్ప, పరిష్కారం చూపించదంటున్నారు.అయితే, చాలా దేశాలు బ్యాటరీలను పవర్ ఫుల్ గా, ప్రమాదాలు జరగకుండా డిజైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఈ ఎజెక్షన్ టెస్ట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: వోల్వో నుంచి ఫస్ట్ లగ్జరీ SUV.. దీని రేంజ్ ఎంతో తెలుసా?