E-Paper
Advertisement

Fitness Resolutions 2026: న్యూ ఇయర్ ఫిట్‌నెస్ ప్లాన్.. మధ్యలోనే వదిలేయకుండా ఉండటానికి సింపుల్ టిప్స్

Fitness Resolutions 2026: న్యూ ఇయర్ ఫిట్‌నెస్ ప్లాన్.. మధ్యలోనే వదిలేయకుండా ఉండటానికి సింపుల్ టిప్స్
Advertisement

Fitness Resolutions  2026: కొత్త ఏడాది క్యాలెండర్ మారుతోంది. దీంతో పాటు మనం కూడా మారాలని అనుకుంటాం. ఈ సందర్భంగానే కొందరు బరువు తగ్గాలని కోరుకుంటే.. మరికొందరు వారి వారి డైలీ రొటీన్ మెరుగు పరచుకోవాలని కోరుకుంటారు. వాస్తవానికి, ఆరోగ్యం ఒక ప్రాజెక్ట్ కాదు. చిన్న లోపాలు, తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా మనల్ని మనం మెరుగు పరుచుకోవడానికి ఇది నిరంతరం సిద్ధం చేసుకోవడం.

Advertisement

చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్ లను గురించి విన్నప్పుడు, అవి కేవలం తాత్కాలికం అని అనుకుంటారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? వాస్తవానికి రిజల్యూషన్ న్యూ ఇయర్ సమయంలో ఉత్సాహంగా తీసుకుంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత, ప్రయత్నాలు తగ్గుతాయి. కొన్నిసార్లు, రిజల్యూషన్ నెరవేరకపోతే.. ఆత్మ విశ్వాసం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యం స్వల్పకాలిక లక్ష్యంగా ఉండకూడదు. శరీరం, మనస్సు, భావోద్వేగాల మధ్య సామరస్యాన్ని సృష్టించే జీవితకాల ప్రక్రియ ఇది. మీరు మీ రిజల్యూషన్ కట్టుబడి ఉంటే, విజయం కష్టం కాదు.

Advertisement

ఆరోగ్యంగా ఉండటం ద్వారానే మనం ఏదైనా సాధించగలం. మీరు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే.. చురుకుగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండటం వల్ల మీ శక్తి, సమయం, డబ్బు ఆదా అవుతుంది అంతే కాకుండా మీరు ఇతరులకు సహాయం చేయగలరు. సానుకూలంగా ఉండేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడం ఒక్కటే సరిపోదు:

సంపూర్ణ ఆరోగ్యం అంటే బరువు తగ్గడం, బెల్లీ ఫ్యాట్ తొలగించుకోవడం మాత్రమే కాదు. ఫిజికల్ గా మెంటల్ గా ఆరోగ్యంగా ఉండటమే సంపూర్ణ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. జిమ్‌ కు వెళ్లి ఫిట్‌గా మారడం మంచిదే. కానీ మీలో కరుణను పెంపొందించుకోవడం ఇంకా మంచిది. సమిష్టి బాధ్యతను స్వీకరించడం ఉత్తమ వ్యాయామం.

బాగా నిద్రపోవాలని నిర్ణయించుకోండి:

కార్పొరేట్ జీవితం, గాడ్జెట్‌లు నాణ్యమైన నిద్రకు దూరం చేసాయి. ఈ నూతన సంవత్సరంలో.. నిద్ర విషయంలో రాజీ పడకూడదని సంకల్పించుకోండి. మీ శరీరాన్ని ఉల్లాసంగా, వ్యాధుల బారిన పడకుండా ఉంచడానికి, మీరు ప్ర రోజుతి రాత్రి సమయానికి నిద్రపోండి. నిద్ర కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. అంతే కాకుండా మరుసటి రోజు కోసం శరీరంలో శక్తిని నింపుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయ పడుతుంది.

Also Read: చర్మ సౌందర్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. బాదం పాలతో కలిగే లాభాలు ఇవే !

మిమ్మల్ని మీరు శక్తితో నింపుకోండి:

మీరు ప్రతి రోజూ మీ శ్వాస పై శ్రద్ధ వహించి, సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలను తీసుకుంటే, మీరు సానుకూల శక్తితో నిండిపోతారు.అలసటనుతగ్గించుకోవడానికి ప్రకృతితో సమయం గడపండి. సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలిలో నడవండి. నేలపై చెప్పులు లేకుండా నడవండి. మీరు ప్రకృతిని గౌరవిస్తే.. అది అదే ప్రేమను తిరిగి ఇస్తుంది. మీరు మీ 100% ఇవ్వండి.

మీ ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. అంతే కాకుండా మీ ప్రయత్నంపై ఆధార పడండి. జీవితాన్ని మరింత అందంగా ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించండి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి దారి తీస్తుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×