E-Paper
Advertisement

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!
Advertisement

Train Retirement: దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలు గుర్తింపు పొందాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను రైళ్లు తమ గమ్యస్థానం చేరుస్తుంటాయి. అయితే ప్రతీ దానికి ఒక ఎక్స్ పైరీ డేట్ ఉన్నట్లు రైళ్లకు సైతం రిటైర్మెంట్ ఉండాల్సిందే. నిరంతరాయంగా పరిగెత్తే రైళ్ల ఇంజన్లు, బోగీలకు ఏదోక రోజు విశ్రాంతి తీసుకోవాల్సిందే. మరి సర్వీసు ముగిసిన రైళ్లను రైల్వేశాఖ ఏం చేస్తుంది? వాటిని ఎక్కడికి తీసుకెళ్తుంది? తిరిగి వాటిని ఏ విధంగా వినియోగిస్తుంది? వంటి ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రైళ్ల రిటైర్మెంట్ వయసు ఎంత?

సాధారణంగా భారతీయ రైల్వేలో ఒక రైలు బోగీ (Coach) లేదా ఇంజన్ ఆయుష్షు 25 నుండి 35 సంవత్సరాలు ఉంటుంది. నిర్ణీత కాలం ముగిసిన తర్వాత భద్రతా పరమైన కారణాలతో వాటి సేవలకు ఫుస్ స్టాప్ బెడుతుంటారు. సర్వీసు నుంచి ఆ రైళ్లను తొలగిస్తుంటారు. ఒకసారి రైళ్ల ఇంజిన్, బోగీల కాలపరిమితి తీరిపోయాక.. వాటిని ట్రాక్‌లపై తిప్పడాన్ని రైల్వే చట్టాలు సైతం నిషేధించాయి.

మరి పాత రైళ్లను ఏం చేస్తారు?

Advertisement

రైళ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వాటిని ‘స్క్రాప్’ జాబితాలో రైల్వే శాఖ చేరుస్తుంది. రిటైర్డ్ ఇంజిన్లు, బోగీలను దేశంలోని వివిధ రైల్వే స్క్రాప్ యార్డులకు తరలిస్తారు. అనంతరం రైల్వే శాఖ వీటికి ఆన్‌లైన్ ద్వారా బహిరంగ వేలం నిర్వహిస్తుంది. పెద్ద పెద్ద ఇనుము వ్యాపారులు, రీసైక్లింగ్ కంపెనీలు ఈ వేలంలో పాల్గొని వాటిని కొనుగోలు చేస్తాయి. దీని ద్వారా రైల్వేకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది.

విడిభాగాల పునర్వినియోగం

అయితే రైళ్లను స్క్రాప్ గా మార్చడానికి ముందే రైల్వే నిపుణుల బృందం దానిని పరిశీలిస్తుంది. అందులో ఇంకా పనికొచ్చే విడిభాగాలు ఏమైనా ఉన్నాయా? చెక్ చేస్తుంది. ఫ్యాన్లు, లైట్లు, సీట్లు, వైరింగ్, బ్రేక్ సిస్టమ్స్ వంటి వస్తువులు పనికొచ్చేలా ఉంటే.. వాటిని జాగ్రత్తగా తొలగిస్తారు. వాటికి ఉన్న దుమ్ము, దూళి, తుప్పును తొలగించి.. కొత్త పెయింట్ తో ఇతర రైళ్లల్లో వాటిని ఫిక్స్ చేస్తారు. తద్వారా అనవసర ఖర్చును రైల్వే శాఖ తగ్గించుకుంటుంది.

రెస్టారెంట్లుగా మేకోవర్..

Advertisement

గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో రిటైర్డ్ రైలు బోగీలకు మంచి క్రేజ్ వచ్చింది. భారతీయ రైల్వే దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్ల పరిసరాల్లో పాత బోగీలను ‘కోచ్ రెస్టారెంట్లు’ (Rail Coach Restaurants)గా తీర్చిదిద్దుతోంది. పాత బోగీని లోపల ఏసీ, లైటింగ్, అధునాతన సీటింగ్‌తో డిజైన్ చేసి ప్రజలకు వినూత్నమైన డైనింగ్ అనుభూతిని అందిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా వేలంలో వీటిని కొని థీమ్ హోటళ్లుగా మార్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ట్రాక్ మెయింటెనెన్స్ వాహనాలుగా..

రైల్వేశాఖ కొన్ని పాత బోగీలను పూర్తిగా స్క్రాప్ చేయకుండా.. వాటిని రైల్వే కార్మికుల అవసరాల కోసం కూడా వినియోగిస్తుంటుంది. రైల్వే లైన్ల మరమ్మతులు జరిగే చోట కార్మికులు బస చేయడానికి, టూల్స్ దాచుకోవడానికి లేదా ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యల కోసం వెళ్లే ‘యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్లలో’ వస్తువుల రవాణాకు వీటిని ఉపయోగిస్తారు.

Also Read: మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

మ్యూజియంలలో జ్ఞాపకాలుగా..

రైల్వే శాఖ.. కొన్ని ప్రతీష్టాత్మకమైన రైళ్లను.. మ్యూజియంలో దాచి భవిష్యత్ తరాల వారికోసం అందుబాటులో ఉంచుతోంది. చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న పాత ఆవిరి ఇంజన్లు (Steam Engines).. మొదటి తరం డీజిల్ ఇంజన్లు లేదా దేశ ప్రముఖులు ప్రయాణించిన ప్రత్యేక బోగీలను రైల్వే శాఖ ఎట్టిపరిస్థితుల్లో స్క్రాప్‌కు వేయదని అధికారులు తెలియజేస్తున్నారు. వాటిని దిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతీయ రైల్వే మ్యూజియంలలో పర్యాటకుల సందర్శనార్థం భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: BSNL సూపర్ డూపర్ ప్లాన్.. 150 రోజుల పాటు.. ప్రతీ రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×