E-Paper
Advertisement

లీడ‌ర్‌గా విమ‌ర్శ‌లు.. హీరోగా అభిమానం! ప‌వ‌న్ పై కేటీఆర్ మ‌నోగ‌తమిదేనా? ప‌వ‌న్ సినిమాలంటే అంత ఇష్ట‌మా?

లీడ‌ర్‌గా విమ‌ర్శ‌లు.. హీరోగా అభిమానం! ప‌వ‌న్ పై కేటీఆర్ మ‌నోగ‌తమిదేనా? ప‌వ‌న్ సినిమాలంటే అంత ఇష్ట‌మా?
Advertisement

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ వార్త‌ల్లో ప్ర‌ధాన కేంద్ర బిందువ‌య్యాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ సంబురాలెటుపోయాయో.. ఆ రోజున ఈ ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కాలు, వ‌రాలు ఏమైనా ప్ర‌క‌టిస్తుంద‌నే ఎదురుచూపులు ఎటుపోయాయో.. అయ్యో ఈ సారీ ఇంతేనా? అనే నిరాశా నిస్పృహ‌లు ఎటుపోయాయో ..!? తెలియదు కానీ.. ప‌వ‌న్ రాజ‌కీయ బొమ్మ మాత్రం తెర మీద ఇంకా సూప‌ర్‌గా ఆడుతూనే ఉంది. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందించాడు. ప‌వ‌న్ మాట్లాడిన ప్ర‌తీ మాట‌పై కేటీఆర్ సూటిగా, లోతైన విమ‌ర్శ‌లు చేశాడు.

రాజ‌కీయంగా ప‌రిణితి లేకుండా ప‌వ‌న్ మాట్లాడిన విధానాన్ని త‌ప్పుబ‌ట్టాడు. దేశ‌భ‌క్తి గురించి నీ ద‌గ్గ‌ర నేర్చుకోవాల్సిన అస‌వ‌రం మాకు లేద‌న్నాడు. తెలంగాణ పోరాట చ‌రిత్ర గురించి చెబుతూనే.. ఇది నాలుగు కోట్ల తెలంగాణ పౌర స‌మాజ అయ్య జాగీరేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. న‌టుడిగా అభిమానిస్తామే త‌ప్ప‌.. ఇంటికి వ‌స్తే హైద‌రాబాద్ బిర్యానీ తినిపించి మ‌ర్యాద చేస్తామే త‌ప్ప‌.. ఇలా ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు తెలియ‌కుండా ఇష్ట‌మొచ్చిన రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్నారు. ఇది ఓ ర‌కంగా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో భాగం కూడా కావొచ్చ‌నే అనుమానం వ్య‌క్తం చేశాడు. అంతా బాగానే ఉంది. కానీ ఇంకో మాట‌న్నాడు కేటీఆర్‌. ప‌వ‌న్ న‌టించిన ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ) సినిమాతో తండ్రి కేసీఆర్‌ను పోల్చాడు.

Advertisement

తెలంగాణ ఓజీ కేసీఆర్‌.. ఓకేనా ప‌వ‌న్‌!అని త‌మ పార్టీ గురించి, త‌మ నేత గురించి ప‌వ‌న్‌తో సంక్షిప్తంగా ఈ విధంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఇదే ఆశ్చ‌ర్యం అంద‌రికీ. అస‌లు ఓజీ సినిమాను చాలా మంది చూడ‌లేదు కూడా. ఎందుకంటే అది ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయిన సినిమా.. ఫ్లాప్ సినిమా. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి.. ఆ త‌రువాత వెంట‌నే డిజాస్ట‌ర్ లిస్టులో చేరిపోయిన క‌థ లేని, స‌రుకు త‌క్కువై, హింస‌పెరిగిపోయిన సినిమా. తెర నిండా ర‌క్త‌పాతం పారిన సినిమా. ఈ సినిమాతో కేసీఆర్‌ను పోల్చ‌డంతో అంతా ఓసారి ఆ ఓజీ సినిమా లైన్ ఏందీ? అందులో ప‌వ‌న్ పాత్రేంటీ? అని కూడా స‌ర్చింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. సుజీత్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఓజాస్ గంభీరా అనే పాత్ర‌ను ఓజీగా పిలుచుకునే ఆ సినిమాలో త‌న ప్రాంతాన్ని మాఫియా చేతుల్లోంచి కాపాడేందుకు ఆక‌స్మికంగా వ‌చ్చిపోయే పాత్ర ప‌వ‌న్‌ది అందులో.

కత్తుల‌తో స్వైర విహారం చేస్తూ ఊచ‌కోత‌గా ర‌క్త‌పాతం సృష్టించి.. అలా వెళ్లిపోతుంటాడు. పెద్ద‌గా క‌థ లేదు. అందుకే ఇది ఫ్లాప్‌టాక్‌ను తెచ్చుకున్న‌ది. భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా హ‌క్కులు తీసుకున్న ప్రాంతీయ పంపిణీదారులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు కూడా. స‌రే, త‌న ప్రాంతాన్ని కాపాడుకునే క్ర‌మంలో వీరోచితంగా పోరాడే హీరోతో కేసీఆర్‌ను పోల్చ‌డం కేటీఆర్ ఉద్దేశ‌మై ఉంటుంది. అందుకే ఓజీ సినిమా పేరును తీసుకుని ఉంటాడు. ఎప్పుడు వ‌స్తాడో.. ఎప్పుడు వెళ్తాడో.. కూడా అంతుచిక్క‌ని ఆ పాత్ర తీరు.. ఇప్ప‌టి కేసీఆర్ అనుస‌రిస్తున్న తీరు స‌రిగ్గా న‌ప్పుతుంద‌ని అనుకుని ఉంటాడో తెలియ‌దు. ఇక్క‌డ అది కాదు విష‌యం. అస‌లు ప‌వ‌న్ కెరీర్‌లోనే అభిమానులు సైతం పెద్ద‌గా గుర్తుంచుకోని సినిమా ఇది. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ప‌వ‌నే అన్నాడు ఈ మాట‌.

Advertisement

ఈ మ‌ధ్యే నేను ఓజీ సినిమా తీశాను. అది అప్పుడే మ‌రిచిపోయిన‌ట్టున్నారు.. అని త‌న మీద త‌నే జోక్ వేసుకున్నాడు. ఇంత‌టి డిజాస్ట‌ర్ సినిమాను కేటీఆర్ గుర్తుంచుకున్నాడు.. ఆ క‌థ‌లోని పాత్ర‌ను ఏకంగా త‌న తండ్రితో పోల్చుకున్నాడంటే.. ప‌వ‌న్ సినిమాల‌ను ఏ విధంగా కేటీఆర్ ఫాలో అవుతున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. అంటే కేటీఆర్‌.. ప‌వ‌న్‌కు వీరాభిమాని అని చెప్ప‌క‌నే చెప్పాడ‌న్న‌మాట‌. ఆ మాట చెబితే రాజ‌కీయంగా ప‌వ‌న్ స్థాయి పెంచి.. త‌న స్థాయి త‌గ్గించుకున్న‌ట్టు అవుతుంద‌ని ఆయ‌న ఫీలింగ్ కావొచ్చు. ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తున్నాను కాబ‌ట్టి.. అత‌ని సినిమా పేరునే వాడుకుని.. త‌మ‌కు అన్వ‌యించుకుందామ‌ని కేటీఆర్ అనుకున్నా.. క‌నీస సినిమా నాలెడ్జ్ ఉండాలి. అందులోను ప‌వ‌న్ సినిమాల‌న్నింటిపైనా అత‌నికి కొంత ప‌ట్టు ఉండాలి. అది కొంచెంగా కాదు.. బాగానే ఉంద‌ని తేలింది ఈ మాట‌ల‌తో. అంటే లీడ‌ర్‌గా ప‌వ‌న్ నాట్ ఓకే… బ‌ట్ హీరోగా కేటీఆర్‌కు సూప‌ర్ న‌చ్చాడ‌న్న‌మాట‌.

Related News

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

Big Stories

Advertisement
×