E-Paper
Advertisement

Longest Lasting Cars: ఇండియన్ మార్కెట్ ను ఏలిన టాప్ కార్లు, ప్రజలు ఇప్పటికీ వాటిని మర్చిపోలేరు తెలుసా!

Longest Lasting Cars: ఇండియన్ మార్కెట్ ను ఏలిన టాప్ కార్లు, ప్రజలు ఇప్పటికీ వాటిని మర్చిపోలేరు తెలుసా!
Advertisement

ఇండియన్ కార్ మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. ప్రతి సంవత్సరం ఎన్నో మోడల్స్ దేశీ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. కొన్నికార్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండగా, మరికొన్ని కార్లు దశాబ్దాలుగా  ప్రజాదరణ దక్కించుకున్నాయి. ఇండియన్ మార్కెట్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ హిందూస్తాన్ అంబాసిడర్ (1958-2014)

అంబాసిడర్ కారు భారతీయ మార్కెట్ లో దశాబ్దాలుగా రారాజుగా కొనసాగింది. ఈ కారు గురించి తెలియని వారు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు తెలుసు. ఒకప్పుడు ఈ కారును రాజకీయ నాయకులు, అధికారులు ఎక్కువగా వాడేవారు. దేశం ఇప్పటి వరకు చూసిన అత్యుత్తమ కార్లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. సంవత్సరాలుగా అనేక మార్పులు చేసినా, డిజైన్ లో మాత్రం ఏ మార్పులు చేయలేదు. అంబాసిడర్ దాదాపు అర్ధ శతాబ్దం పాటు భారత రోడ్లపై తిరగాడింది. భారతీయ ఆటోమోటివ్ చరిత్రలో ఎక్కువ కాలం నడిచిన మోడల్ గా గుర్తింపు పొందింది. 2010లలో అమ్మకాలు తగ్గడంతో అంబాసిడర్ కష్టాల్లో పడింది. 2014లో దాని ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

⦿ మారుతి 800 (1983-2014)

Advertisement

భారతీయ ఆటోమోటివ్ చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు.. అందులో మారుతి 800 లేకుంటే సంపూర్ణంగా ఉండదు. సొంతకారు కొనాలనుకునే మధ్య తరగతి ప్రజల కలన నెరవేర్చింది. అప్పట్లో మార్కెట్ ను ఏలుతున్న అంబాసిడర్,  ఫియట్‌ ను మించిన టెక్నాలజీ, మెరుగైన ఫీచర్లు, బెస్ట్ మైలేజ్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. 1983లో ప్రారంభమైన ఈ కారుకు ఏకంగా అప్పట్లోనే 1,20,000 అడ్వాన్స్‌ డ్ బుకింగ్‌లు వచ్చాయి.  దాదాపు 30 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణం తర్వాత 20214లో మారుది 800 తయారీ నిలిచిపోయింది.

⦿ మెర్సిడెస్ బెంజ్ E క్లాస్ (1995 నుంచి)

లగ్జరీ మోడల్ మెర్సిడెస్ బెంజ్ 1995లో E-క్లాస్ కారును భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ లగ్జరీ సెడాన్  దేశంలో దాదాపు 29 సంవత్సరాల అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉంది. E-క్లాస్ ఇప్పటికీ తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్ అని మెర్సిడెస్ వెల్లడించింది.

⦿ హోండా సిటీ (1998 నుంచి)

Advertisement

భారతీయ రోడ్లపై ఎక్కువగా పరుగులు తీసిన కార్లలో హోండా సిటీ కూడా ఒకటి. 1998లో ప్రారంభించబడిన హోండా సిటీ అనే మార్పులకు లోనయ్యింది. చాలా సంవత్సరాలుగా హోండాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. హోండా నుంచి ఎన్నో కార్లు వచ్చి వెళ్లినా, ఇప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

⦿ మారుతి సుజుకి ఆల్టో (2000 నుంచి)

2000లో విడుదలైన మారుతి సుజుకి ఆల్టో ఇప్పటికీ భారతీయ ఆటో మార్కెట్ లో సత్తా చాటుతోంది.  మారుతి 800 స్థాయిలోనే ఆల్టో రాణించింది. ఆల్టో 800కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో ఆల్టో K10ను కూడా తీసుకొచ్చింది. అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఆల్టో నిలిచింది. ప్రస్తుతం ఆల్టో K10 మార్కెట్ లో కొనసాగుతున్నా, ఆల్టో 800కు సంబంధించిన ఉత్పత్తి ఏప్రిల్ 2023 నుంచి నిలిపివేసింది.

Read Also: 2026లో మార్కెట్లో అడుగు పెట్టబోతున్న.. లో కాస్ట్ యూత్ అట్రాక్షన్ బైక్స్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×