E-Paper
Advertisement

JD Vance House Attack: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

JD Vance House Attack: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు
Advertisement

JD Vance House Attack: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరిగింది. సోమవారం అర్ధరాత్రి 12:15 గంటలకు ఈస్ట్ వాల్నట్ హిల్స్‌లోని ఆయ‌న నివాసంపై దుండగుడు కాల్పులు జరిపాడు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల స‌మ‌యంలో జేడీ వాన్స్, ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. గ‌న్‌ ఫైరింగ్‌లో జేడీ వాన్స్ నివాసం కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాడికి కారణం ఇంకా తెలియరాలేదు.

జేడీ వాన్స్ నివాసంపై కాల్పుల సంఘటన ఒహియో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సిన్సినాటి పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆదివారం రాత్రి జేడీ వాన్స్ ఇంటిని పరిశీలించారు. సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఫోటోలు ప్రకారం.. ఒహియోలోని వాన్స్ ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసమై కనిపిస్తున్నాయి. అయితే నివాసంలో ఏం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి జేడీ వాన్స్ లేదా అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నాడా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read:  యూనివర్సిటీలో కాల్పులకు ప్లాన్.. అమెరికాలో పాకిస్థానీ అరెస్ట్.. కారులో భారీగా ఆయుధాలు

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×