E-Paper
Advertisement

ట్యాంక్ ఫుల్ కాగానే పెట్రోల్ ఆటోమేటిక్ ఆగిపోతుంది.. ఎలాగో తెలుసా?

ట్యాంక్ ఫుల్ కాగానే పెట్రోల్ ఆటోమేటిక్ ఆగిపోతుంది.. ఎలాగో తెలుసా?
Advertisement

Petrol Pump Auto Shut-Off Mechanism: పెట్రోల్ బంకుల్లో వాహనాల్లో పెట్రోల్ నింపేటప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం గమనిస్తాం. ట్యాంక్ పూర్తిగా నిండగానే పెట్రోల్ నాజిల్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. బటన్ నొక్కడం లేదంటే, ఎలక్ట్రానిక్ సెన్సార్ వల్ల ఇలా జరగదు. దీనికి కారణం ఓ ఇంట్రెస్టింగ్ మెకానికల్ సిస్టమ్. ఈ సిస్టమ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రం  వెంచూరి ఎఫెక్ట్ (Venturi Effect).

ఇంతకీ ఏంటీ వెంచూరి ఎఫెక్ట్!

వెంచూరి ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పెట్రోల్ నాజిల్ చివర భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెట్రోల్ నింపుతున్నప్పుడు, వాహనం ట్యాంక్‌ లోని గాలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ గాలి ఈ చిన్న రంధ్రం ద్వారా బయటకు వెళుతుంది.  ఇప్పుడు నాజిల్ లోపల పెట్రోల్ వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడుతుంది. నాజిల్ లోని ఇరుకైన భాగంలో ప్రెషర్  తగ్గిపోతుంది. ఈ పీడన తగ్గుదల కారణంగా ఒక రకమైన సక్షన్ ఏర్పడుతుంది. ఇదే వెంచూరి ఎఫెక్ట్.

Advertisement

పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా నిండినప్పుడు పరిస్థితి మారుతుంది. పెట్రోల్ స్థాయి నాజిల్ చివర వరకు చేరుతుంది. అప్పుడు ఆ చిన్న రంధ్రం ద్వారా గాలి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. దాని బదులుగా పెట్రోల్ ఆ రంధ్రంలోకి ప్రవేశిస్తుంది. గాలి బదులుగా పెట్రోల్ రంధ్రంలోకి రావడం వల్ల నాజిల్ లోపల వాక్యూమ్ ప్రభావం మారిపోతుంది. ఈ మార్పును నాజిల్ లోని చిన్న డయాఫ్రాగమ్ గుర్తిస్తుంది. వెంటనే అది ట్రిగ్గర్ మెకానిజాన్ని యాక్టివేట్ చేస్తుంది. దాంతో పెట్రోల్ ప్రవాహం ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.

Read Also: జస్ట్ రూ. 21 లక్షల్లోనే టాటా లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు, పోటీ కంపెనీలకు చుక్కలే!

పూర్తిగా ఓ మెకానికల్ సిస్టమ్

Advertisement

ఇది పూర్తిగా మెకానికల్ సిస్టమ్ మాత్రమే. ఇందులో ఎలాంటి బ్యాటరీలు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ భాగాలు అవసరం ఉండవు. చాలా సింపుల్ గా కనిపించినా, చాలా తెలివైన ఇంజనీరింగ్ డిజైన్. ట్యాంక్ ఆటోమేటిక్‌గా ఫుల్ అయిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ పెట్రోల్ నింపడం మంచిది కాదు. దీనిని ఓవర్‌ ఫిల్లింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ట్యాంక్‌లోని ఆవిరి బయటకు వెళ్లే వెంట్ బ్లాక్ అవుతుంది. వాహనం పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మొత్తంగా పెట్రోల్ నాజిల్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ సిస్టమ్ చాలా చిన్నది. కానీ, చాలా తెలివైన మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు.

Read Also: నీటితో నడిచే కారు వచ్చేసింది.. ఈవీ దుకాణాలు ఇక బంద్!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×