E-Paper
Advertisement

Manual Car vs Automatic car: మాన్యువల్ VS ఆటోమేటిక్.. ఏ కారు బెస్ట్? ఎందుకు?

Manual Car vs Automatic car: మాన్యువల్ VS ఆటోమేటిక్..  ఏ కారు బెస్ట్? ఎందుకు?
Advertisement

Manual Cars Vs Automatic Cars: ఇండియాలో మాన్యువల్ కార్లతో పాటు ఆటో మేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, గత కొంతకాలంగా  ఆటోమేటిక్ కార్ల వినియోగం పెరుగుతోంది.  కారులో ట్రాన్స్‌ మిషన్ (Transmission) అంటే ఇంజిన్ నుంచి వచ్చే పవర్‌ను వీల్స్‌ కు బదిలీ చేసే సిస్టమ్. ఇది రెండు రకాలు ఉంటుంది. ఒకటి మాన్యువల్ (Manual Transmission – MT) కాగా, మరొకటి ఆటోమేటిక్ (Automatic Transmission – AT).

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (Manual)

డ్రైవర్ స్వయంగా గేర్ షిఫ్ట్ చేయాలి. సాధారణంగా 5 లేదంటే 6 గేర్లు ఉంటాయి. క్లచ్ పెడల్ (left side) ఉంటుంది. గేర్ మార్చేటప్పుడు క్లచ్ నొక్కి, గేర్ స్టిక్ (H-pattern) మార్చాలి.ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. కానీ, రద్దీలో అలసటగా ఉంటుంది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (Automatic)

Advertisement

కారు స్వయంగా గేర్ మారుస్తుంది (స్పీడ్, లోడ్ ఆధారంగా). క్లచ్ పెడల్ ఉండదు.  కేవలం బ్రేక్, యాక్సిలరేటర్ మాత్రమే ఉంటుంది.  గేర్ స్టిక్‌లో P (Park), R (Reverse), N (Neutral), D (Drive) లాంటి ఆప్షన్లు ఉంటాయి. Traditional AT, AMT (Automated Manual), CVT (స్టెప్‌లెస్), DCT (డ్యూయల్ క్లచ్) ఉంటుంది.

మాన్యువల్ లో డ్రైవర్ గేర్,  క్లచ్ ను కంట్రోల్ చేస్తాడు.  ఆటోమేటిక్ లో కారు ఆటోమేటిక్‌ గా కంట్రోల్ అవుతుంది.  సులభంగా,  సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఈజీగా ఉంటుంది.

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లాభాలు

Advertisement

చవకైన ధర ఉంటుంది. ఆటోమేటిక్ కంటే రూ.1-2 లక్షలు తక్కువ ఉంటుంది. మంచి మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ కంట్రోల్,  డ్రైవింగ్ ఫన్ ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, ఈజీ రిపేర్ అవుతుంది. మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది.

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ నష్టాలు

సిటీ ట్రాఫిక్‌లో అలసటగా ఉంటుంది. పదే పదే క్లచ్, గేర్ షిఫ్ట్ చేయాలి. బిగినర్స్‌ కు కష్టంగా ఉంటుంది. రద్దీలో డ్రైవర్ ఫోకస్ తగ్గుతుంది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లాభాలు

సిటీ ట్రాఫిక్‌లో సౌకర్యంగా ఉంటుంది.  తక్కువ అలసట ఉంటుంది. కేవలం బ్రేక్, యాక్సిలరేటర్ ఉంటుంది. స్మూత్ డ్రైవ్ లభిస్తుంది. బిగిన, మహిళలకు సులభంగా ఉంటుంది. మోడర్న్ ఫీచర్లు (ప్యాడిల్ షిఫ్టర్స్ DCTలో) ఉంటాయి. రద్దీ నగరాల్లో (ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు) బెస్ట్ ఆప్షన్.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ నష్టాలు

ఖరీదు ఎక్కువ. ఇదే మోడల్ మాన్యువల్ కంటే ఎక్కువ ఉంటుంది. మైలేజ్ కాస్త తక్కువ. మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది. హిల్స్, హైవేలో కొంచెం తక్కువ కంట్రోల్ ఉంటుంది.  (AM

Read Also: మారుతి సుజుకి To కియా.. దేశీ మార్కెట్లో బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!

ఇండియాలో ఏది మంచిది?

సిటీ డ్రైవింగ్ & రద్దీ ట్రాఫిక్: ఆటోమేటిక్ బెస్ట్.

హైవే & లాంగ్ డ్రైవ్స్,బడ్జెట్: మాన్యువల్ మంచిది.

ఓవరాల్: రోజూ ట్రాఫిక్‌లో గడిపేవారు ఆటోమేటిక్ తీసుకోండి. బడ్జెట్, డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవారు మాన్యువల్ వైపు మొగ్గు చూపడం మంచిది.

Read Also: మారుతి సుజుకి విక్టోరిస్- హోండా సిటీ e:HEV.. పెట్రోల్, హైబ్రిడ్ లో ఏది బెస్ట్?

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×