PSL owners demand to cut player salaries: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Pakistan Super League 2027 Tournament) ఆడే క్రికెటర్లకు ఊహించని షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే సీజన్ లో ప్లేయర్ల జీతాలు కట్ చేసేందుకు పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు మొదలుపెట్టినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ముందు పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు డిమాండ్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే దీనికి మొహ్సిన్ నఖ్వీ ఒప్పుకోలేదని కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే తక్కువ జీతాలు ఇస్తున్నారని… అందులోనే భారీ కోత విధిస్తే ఎలా బతుకుతారంటూ రివర్స్ అయ్యారట. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇవ్వాల్సిన బకాయిలు ముందుగా చెల్లించి, ఆ తర్వాత జీతాల కోతపై మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెటర్ల జీతాల కోత అంశం హాట్ టాపిక్ అయింది.
లండన్ వేదికగా పాకిస్తాన్ సూపర్ లీగ్ కౌన్సిల్ సమావేశంలో ప్లేయర్ల జీతాలపై కీలక చర్చ జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ప్లేయర్లు సరిగ్గా ఆడడం లేదని.. దీని వల్ల వ్యూయర్షిప్ తగ్గిపోతుందని ఫ్రాంచైజీ ఓనర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ల జీతాలను కట్ చేయాల్సిందేనని అందరూ ఒకే తాటిపైకి వచ్చారు. ఆట తీరును బట్టి జీతాలు ఇవ్వాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ముందు డిమాండ్ పెట్టారు. కానీ దీనికి మొహ్సిన్ నఖ్వీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా… వాళ్లపై రివర్స్ అయ్యారట. పాత బకాయిలు ఉన్న ఫ్రాంచైజీలు వెంటనే డబ్బులు చెల్లించాలని.. అక్టోబర్ 31వ తేదీ లోపు క్లియర్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ మార్చి 18వ తేదీ నుంచి మే రెండవ తేదీ వరకు కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 44 మ్యాచ్ లు 6 వేదికల్లో జరుగుతాయి. ఈ సారి ప్రేక్షకులతోనే టోర్నమెంట్ నిర్వహిస్తారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఒక్కో ప్లేయర్ కు సగటున రూ. 50 లక్షల వరకు వస్తాయి. ప్లాటినం కేటగిరిలో ఉంటే కోటిన్నర రూపాయలు దక్కుతాయి. అదే డైమండ్ కేటగిరీలో ఉన్న వాళ్లకు రూ. 50 లక్షలు నుంచి రూ. 70 లక్షల వరకు అందిస్తారు. గోల్డ్ కేటగిరి లో ఉన్న వాళ్లకు రూ. 33 నుంచి రూ. 42 లక్షలు దక్కుతాయి. సిల్వర్ కేటగిరీలో ఉన్న వాళ్లకు రూ. 12 నుంచి రూ. 21 లక్షలు.. ఎమర్జింగ్ కేటగిరీలో ఉన్న వాళ్లకు ఆరు లక్షల వరకు మాత్రమే వస్తాయి. ఐపీఎల్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్లకే మినిమమ్..రూ.2 కోట్లు ఉంటుంది. అలాంటిది పీఎస్ఎల్ లో జీతాలు కట్ చేస్తే, పాక్ ప్లేయర్లు అడుక్కుతినాల్సిందేనని అంటున్నారు.