Ducati Panigale V2 S: డుకాటీకి చెందిన ప్రముఖ సూపర్ బైక్ ‘పానిగేల్ వి2 ఎస్’ (Ducati Panigale V2 S) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికన్ కంపెనీకి చెందిన ఈ బైక్‌కు సంబంధించి ఓ సరికొత్త అప్‌డేట్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఎంతో ఆకర్షణీయమైన ‘వివిడ్ ఎల్లో’ (Vivid Yellow) రంగులో ఈ బైక్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ స్పోర్ట్స్ బైక్ డెలివరీలు.. దేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి.
డుకాటీ పానిగేల్ వి2 ఎస్ పసుపు రంగు వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 21.86 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ బ్రాండ్ నుంచి వస్తున్న బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు మొదలుపెట్టారు. సాధారణంగా డుకాటీ అనగానే ‘రెడ్’ కలర్ గుర్తుకొస్తుంది. కానీ ఈ సరికొత్త పసుపు రంగు (వివిడ్ ఎల్లో) రోడ్డుపై వెళ్తుంటే.. ఎవరినైనా ఆకట్టుకునేలా ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇవ్వనుంది.
ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని బాడీ ఎక్కువ భాగం ప్రకాశవంతమైన పసుపు రంగులో మెరిసిపోతోంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ముందు భాగంలో అగ్రెసివ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఏరోడైనమిక్ బాడీ వర్క్, మస్కులర్ ఇంధన ట్యాంక్, వెనుక వైపు ఉన్న స్లీక్ షార్ప్ టైల్ సెక్షన్ ఈ బైక్‌కు అసలైన రేసింగ్ బైక్ లుక్‌ని తెచ్చిపెట్టాయి.
ఈ పానిగేల్ వి2 ఎస్ మోడల్‌లో అత్యంత శక్తివంతమైన 955cc సూపర్ క్వాడ్రో V-ట్విన్ (V-twin) ఇంజిన్ ను ఉపయోగించారు. ఇది 155 bhp పవర్ ను, 104 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్ ను అందించారు. ఇందులో ఉన్న ‘దుకాటీ క్విక్ షిఫ్టర్’ (DQS) వల్ల గేర్లు చాలా వేగంగా, స్మూత్‌గా మార్చుకునే వెసులుబాటు ఉండనుంది. ట్రాక్ మీదైనా, హైవే మీదైనా ఈ ఇంజిన్ అందించే స్పీడ్ రైడర్లకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ‘S’ వేరియంట్ కావడంతో దీనిలో అత్యంత నాణ్యమైన సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ అందించారు. ముందు వైపు పూర్తిగా అడ్జస్ట్ చేసుకోగలిగే Öhlins NIX30 ఫోర్కులు, వెనుక వైపు Öhlins TTX36 మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు. అటు ముందు చక్రానికి Brembo M4.32 మోనోబ్లాక్ కాలిపర్లు కలిగిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు, వెనుక సింగిల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇవి వేగంగా వెళ్తున్న బైక్‌ను కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ఆపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read: పల్సర్ ప్రేమికులకు తీపి కబురు.. సరికొత్త 125cc, 150cc మోడల్స్ వచ్చేస్తున్నాయ్..!
మరోవైపు రైడర్ భద్రత కోసం అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ఫీచర్లను ఈ బైక్ లో డుకాటీ జోడించింది. రేస్, స్పోర్ట్, స్ట్రీట్ అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఇందులో తీసుకొచ్చారు. వీటన్నింటినీ స్టీరింగ్ వద్ద ఉన్న స్విచ్‌లతో కంట్రోల్ చేస్తూ.. బైక్‌లో ఉన్న 4.3 అంగుళాల రంగుల TFT డిస్‌ప్లేపై చూసుకోవచ్చు. మెుత్తంగా సరికొత్త లుక్, నమ్మశక్యం కాని వేగం, అత్యాధునిక సాంకేతికత కోరుకునే లగ్జరీ స్పోర్ట్స్ బైక్ ప్రియులకు.. ఈ ‘డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ఎల్లో’ ఒక డ్రీమ్ బైక్‌గా నిలుస్తుందని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Also Read: కంటిలో చిప్ పెడితే.. చూపు వచ్చేస్తుందట.. ఏమన్నా టెక్నాలజీనా!