Gadwal: స్వేచ్చ బ్యూరో: గద్వాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు కృష్ణవేణి చౌరస్తా, కొత్త బస్టాండ్ రోడ్డు తదితర ప్రధాన ప్రాంతాలలో రోడ్లు, పుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియను గురువారం పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు ఎక్కడి వరకు మార్కింగ్ వేశారో అక్కడ వరకు రోడ్లకు ఇరువైపులా ఆక్రమించి అక్రమంగా నిర్వహిస్తున్న దుకాణాలను, షెడ్లను తొలగిస్తున్నారు. ఆపరేషన్ రోప్‌లో భాగంగా ఫుట్‌పాత్‌లపై, రహదారులకు ఇరువైపుల వెలసిన దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తొలగిస్తున్నారు. కృష్ణవేణి చౌరస్తా నుంచి గర్ల్స్ హై స్కూల్ వరకు రోడ్డుకు ఇరువైపుల ఆక్రమణల తొలగింపు కొనసాగుతుందని, గద్వాల పట్టణంలో విడుతల వారిగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని గద్వాల మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
గద్వాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు కృష్ణవేణి చౌరస్తా, కొత్త బస్టాండ్ రోడ్డు తదితర ప్రధాన ప్రాంతాలలో రోడ్లు, పుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పునఃప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చుక్క సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Also Read: Gurukul Vacancies: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి బ్రేక్.. బ్యాక్ డోర్‌లో అమ్మేస్తున్నారా?
గతంలో భీంనగర్, అంబేద్కర్ చౌరస్తా వంటి రద్దీ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల గుర్తించి మార్కింగ్ వేసి, పనులు ప్రారంభించినప్పటికీ అర్ధాంతరంగా నిలిపివేయడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. కేవలం అధికారులు హెచ్చరికలు, మార్కింగ్‌లతో సరిపెట్టి వెనక్కి తగ్గడం వల్ల ఆక్రమణదారులు మళ్లీ యథారాజా తథాప్రజగా రోడ్లను ఆక్రమించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ప్రారంభించిన ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, చివరి వరకు పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Tirumala Theft: తిరుమల విగ్రహం చోరి కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు టీడీపీ నేతగా గుర్తింపు!