E-Paper
Advertisement

కంటిలో చిప్ పెడితే.. చూపు వచ్చేస్తుందట.. ఏమన్నా టెక్నాలజీనా!

కంటిలో చిప్ పెడితే.. చూపు వచ్చేస్తుందట.. ఏమన్నా టెక్నాలజీనా!
Advertisement

PRIMA Vision: కంటిచూపు కోల్పోయిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కీలక ముందడుగు పడింది. వయోభారం వల్ల వచ్చే దృష్టి లోపాన్ని తిరిగి రప్పించే ‘ప్రిమా’ (PRIMA) అనే పరికరాన్ని పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ.. ‘సైన్స్ కార్పొరేషన్’ (Science Corp) అభివృద్ధి చేసింది. అంతేకాకుండా ఐరోపా మెడికల్ డివైస్ రెగ్యులేటర్ దీని విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అనుమతులు సైతం మంజూరు చేసింది. అటు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ కూడా ఈ పరికరాన్ని సమీక్షించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

‘చూపు పోయినా.. పుస్తకం చదివారు’

ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడిన లక్షలాది మంది ఈ ‘మ్యాక్యులర్ డీజనరేషన్’ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కంటి వెనుక భాగంలో ఉండే కాంతిని గ్రహించే కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల పుస్తకాలు చదవడం, వ్యక్తుల ముఖాలను గుర్తుపట్టడం సాధ్యపడటం లేదు. అయితే ‘ప్రిమా పరికరం’ అమర్చుకున్న రోగులు మళ్లీ సాధారణంగా చదవగలుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక రోగి ఈ చిప్ సహాయంతో ఏకంగా 300 పేజీల నవలను చదివి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మరొక పేషెంట్.. సుడోకు, క్రాస్‌వర్డ్ పజిల్స్ పూర్తి చేశారని తెలియజేస్తున్నారు.

‘ప్రిమా’ ఎలా పనిచేస్తుంది?

Advertisement

ఈ పరికరాన్ని అమర్చడానికి రోగులకు ఒక గంట పాటు చికిత్స అవసరం అవుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా కంటి వెనుక భాగంలో ఒక చిన్న మైక్రోచిప్‌ను అమరుస్తారు. దానికి అనుసంధానిస్తూ రోగులకు కెమెరాతో కూడిన ప్రత్యేక కళ్లజోడును అందిస్తారు. ఈ కళ్లజోడు దృశ్యాలను రికార్డు చేసి.. కంటిలోని చిప్‌కు డిజిటల్ సంకేతాల రూపంలో సమాచారాన్ని పంపుతుంది. తద్వారా కంటి ముందు ఉన్న వస్తువులను వృద్ధులు చూడగలుగుతారని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

జీవకణాలతో సిలికాన్ చిప్‌ల లింకప్

ఇదిలా ఉంటే సైన్స్ కార్పొరేషన్ సంస్థ సీఈఓ మాక్స్ హోడక్ గతంలో ఎలాన్ మస్క్‌కు చెందిన ‘న్యూరాలింక్’ సంస్థకు సహ-స్థాపకుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2021లో న్యూరాలింక్ నుండి బయటకు వచ్చిన హోడక్.. సిలికాన్ చిప్‌లు, జీవకణాల కలయికతో కొత్త తరహా బీసీఐ (బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్) పరికరాలను తయారుచేయడానికి.. సైన్స్ కార్పొరేషన్‌ను స్థాపించారు. ఈ క్రమంలోనే 2024లో ఫ్రాన్స్‌కు చెందిన ‘పిక్సియమ్’ కంపెనీని కొనుగోలు చేసి.. ఈ ‘ప్రిమా’ సాంకేతికతను వాణిజ్య స్థాయికి తీర్చిదిద్దారు.

Advertisement

Also Read: రైల్వేలో కొత్త రూల్.. టీసీలకు బాడీ కెమెరాలు.. తప్పు చేస్తే దొరికేస్తారు!

ఇంతకీ ధర ఎంతంటే?

అయితే ఒక్కో ప్రిమా పరికరం ధర కొన్ని లక్షల డాలర్లు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఐరోపాలోని ఆరోగ్య సంరక్షణ సంస్థలతో ఇన్సూరెన్స్ రీ-ఇంబర్స్‌మెంట్ ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే సెప్టెంబర్ నాటికి జర్మనీలో మొదటి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో భవిష్యత్తులో మరింత అధునాతన బయో-హైబ్రిడ్ బ్రెయిన్ సెన్సార్లను, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) తరహా కళ్లజోళ్లను అభివృద్ధి చేయడమే తమ తుది లక్ష్యమని మాక్స్ హోడక్ తెలిపారు.

Also Read: రైళ్లలో సీట్ల కొరత తీరినట్లే.. త్వరలో 17,000 కొత్త జనరల్, స్లీపర్ కోచ్‌లు!

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×