E-Paper
Advertisement

జస్ట్ రూ.99 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

జస్ట్ రూ.99 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
Advertisement

E3 Tryon Electric Scooter Launch: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ అడుగుపెట్టింది. E3 ఎలక్ట్రిక్ సంస్థ కొత్త ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.99,999 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం బెంగళూరులో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఇతర నగరాల్లో కూడా ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది.

మూడు వేరియంట్లలో E3 ట్రయాన్

E3 ట్రయాన్ స్కూటర్‌ను కంపెనీ మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. అవి C1, C1x, C2. ప్రతి వేరియంట్‌లో బ్యాటరీ, రేంజ్, మోటార్ సామర్థ్యం పరంగా తేడాలు ఉన్నాయి. దీంతో వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా సరైన మోడల్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

అత్యంత సరసమైన C1 వేరియంట్ ధర రూ.99,999. ఇందులో 2.3kWh సామర్థ్యం గల రిమూవబుల్ బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌ తో 108 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఇందులో 2.5kW ఎలక్ట్రిక్ మోటార్ ఉండగా, గరిష్ట వేగం 67 కిలోమీటర్లుగా  ఉంది.

C1x వేరియంట్‌లో కొంచెం పెద్ద 3kWh ఫిక్స్‌ డ్ బ్యాటరీ ఉంటుంది. ఈ మోడల్ పూర్తి ఛార్జ్‌పై 165 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు సమయం పడుతుంది. ఇందులో కూడా 2.5kW మోటార్‌ నే ఉపయోగించారు. గరిష్ట వేగం 67 కిలోమీటర్లు. ఈ వేరియంట్ ధర రూ.1,09,999.

Advertisement

టాప్ వేరియంట్ C2లో కూడా 3kWh బ్యాటరీనే ఉన్నప్పటికీ, ఇందులో మరింత శక్తివంతమైన 3.5kW మోటార్ అందించారు. దీంతో ఈ స్కూటర్ గరిష్టంగా 82 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే, ఈ మోడల్ రేంజ్ 128 కిలోమీటర్లుగా ఉంది. అంటే C1xతో పోలిస్తే రేంజ్ కొంత తక్కువగా ఉంటుంది. ఈ టాప్ వేరియంట్ ధర రూ.1,19,999.

ఫీచర్ల గురించి..

ఈ మూడు వేరియంట్లలో కూడా అత్యాధునిక సదుపాయాలను అందించారు. C1లో 5 అంగుళాల LCD డిస్‌ ప్లే ఉంటుంది. ఇందులో స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీతో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ సౌకర్యం కూడా లభిస్తుంది. C1x, C2 వేరియంట్లలో కూడా ఇదే LCD స్క్రీన్ ఉన్నప్పటికీ, అదనంగా కొన్ని AI ఆధారిత ఫీచర్లను అందించారు. వీటిలో AI ఛార్జింగ్ ఇన్‌ సైట్స్, అడాప్టివ్ లెర్నింగ్ లాంటి స్మార్ట్ టెక్నాలజీలు ఉన్నాయి. ఇవి బ్యాటరీ వినియోగాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని కంపెనీ చెబుతోంది.  సీటు కింద స్టోరేజ్, గ్లోవ్ బాక్స్, ఫ్లోర్‌ బోర్డ్ స్టోరేజ్ కలిపి మొత్తం 52 లీటర్ల సామర్థ్యం ఉంది. దీంతో రోజువారీ అవసరాల కోసం బ్యాగులు లేదా ఇతర వస్తువులను సులభంగా తీసుకెళ్లవచ్చు.  మూడు వేరియంట్లపై కూడా 8 సంవత్సరాలు, 1 లక్ష కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ ఇస్తోంది.

Read Also: ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

Tags

Related News

KTM 390 అడ్వెంచర్ X ధర పెంపు, ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే?

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్.. వారెవ్వా.. ఏం ఫీచర్లు గురూ!

టెస్లా, BYDలకు షాక్.. భారత ఈవీలకు ప్రపంచ గుర్తింపు!

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?

ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×