E-Paper
Advertisement

అమ్మబాబోయ్.. జియో నుంచి అస్సలు ఊహించని ప్లాన్.. జస్ట్ రూ.175 కే 10 పైగా ఓటీటీలు!

అమ్మబాబోయ్.. జియో నుంచి అస్సలు ఊహించని ప్లాన్.. జస్ట్ రూ.175 కే 10 పైగా ఓటీటీలు!
Advertisement

Jio 175 Plan: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో తమ వినియోగదారులను ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలోనే ఎక్కువ డేటాతో పాటు రకరకాల ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్లను అందిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే జియో రూ. 175 తో ఒక ప్రత్యేకమైన డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. చౌక ధరలో అదనపు డేటా, వినోదాన్ని కోరుకునే వారికి ఈ ప్లాన్ ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుందని జియో చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం.

రూ.175 ప్లాన్ వివరాలు..

జియో రూ. 175 ప్లాన్ అనేది ఒక డేటా యాడ్-ఆన్ (Data Add-on) ప్యాక్. అంటే దీనికి ప్రత్యేకంగా కాలింగ్, ఎస్‌ఎంఎస్ సదుపాయాలు ఉండవు. కాబట్టి మీరు అప్పటికే కలిగి ఉన్న రీఛార్జ్ పై ఇది పనిచేయనుంది. ఇక ఈ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. దీని ద్వారా యూజర్లకు మొత్తం 10 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో దానిని ఎప్పుడైనా వాడుకోవచ్చు.

దుమ్మురేపే ఓటీటీ బెనిఫిట్స్

Advertisement

ఈ ప్లాన్ లో ఓటీటీ బెనిఫిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రూ. 175 తో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులు దాదాపు 10కి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా పొందొచ్చు. ఇందులో జియోసినిమా ప్రీమియం, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, కాంచ లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయ్‌చోయ్ వంటి సబ్‌స్క్రిప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఓటీటీలన్నింటినీ జియో 28 రోజుల పాటు ఫ్రీగా ఆస్వాదించవచ్చు.

ఈ ప్లాన్ ఎవరికి ఎక్కువ లాభం?

డైలీ డేటా లిమిట్ పూర్తయి, అదనంగా డేటా అవసరమైన వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఒకే రీఛార్జ్‌తో రకరకాల ఓటీటీల్లోని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ చూడాలనుకునే వారికి ఇది ఎంతో లాభదాయకం. సాధారణంగా కొందరు విడివిడిగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు తీసుకొని అందుకు రూ.వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారికి కేవలం రూ.175కే 10పైగా ఓటీటీలు ఈ ప్లాన్ లభిస్తుండటం పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: Airtelలో ఇంత మంచి ప్లాన్ ఉందా? ఏడాదంతా అపరిమిత 5G, కాల్స్, ఫ్రీ ఓటీటీ.. వర్త్ వర్మా వర్త్!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

జియో రూ. 175 ప్యాక్‌ను చాలా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్‌లోని మై జియో యాప్ ఓపెన్ చేసి రీఛార్జ్ విభాగానికి వెళ్లి రూ. 175 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి యాప్‌ల ద్వారా, జియో అధికారిక వెబ్‌సైట్ (Jio.com) ద్వారా కూడా ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: మందుబాబులకు బిగ్ షాక్.. బోనాల వేళ వైన్ షాపులు క్లోజ్.. ఆ రెండ్రోజులు చుక్క లేనట్లే!

Tags

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×